Ads
మనం రోడ్డు మీద వెళ్తుంటాము అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. మనం హెల్ప్ చేయాలనుకుంటాం కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలుసా.. అలాగే పక్కింట్లో అగ్నిప్రమాదం జరుగుతుంది మనం ఏమి చేయడని పరిస్థితి అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలుసా అసలు మీకు హెల్ప్ లైన్స్ సంగతి తెలుసా తెలుసుకోకపోతే తెలుసుకోండి ఈ హెల్ప్ లైన్లు మనకి అత్యవసరంలో బాగా ఉపయోగపడతాయి.
Video Advertisement
ఈ నెంబర్ లని కేంద్ర ప్రభుత్వం అందరికీ తెలిసేలాగా చేయాలని అనేక చర్యలు తీసుకుంది కానీ ఇద్దరు అదృష్టం కొద్ది చాలామందికి ఈ హెల్ప్ లైన్స్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. మనం చూస్తూ ఉండగానే చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బహిరంగ ప్రదేశాలలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏం చేయాలో అటువంటి అప్పుడు 101 కి డయల్ చేస్తే తక్షణమే స్పందిస్తారు ఇది అగ్నిమాపక విభాగానికి సంబంధించిన నెంబర్.
అదే సమయంలో మన కళ్ళ ఎదురుగుండా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు లేదంటే మన దగ్గరే ఎవరైనా ఏదైనా దొంగిలించినప్పుడు 100 కి డయల్ చేయండి ఇది పోలీసు శాఖకి సంబంధించిన నెంబర్. అలాగే 102 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసినట్లయితే తక్షణమే వైద్య సేవలను పొందవచ్చు. అలాగే 108 నెంబర్ కి డయల్ చేయడం ద్వారా కూడా అత్యవసర వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు. రైలు ప్రమాదం జరిగినప్పుడు 1072 టోల్ ఫ్రీ నెంబర్ కి డయల్ చేయవచ్చు. అలాగే ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు 103 కి కాల్ చేయటం ద్వారా ట్రాఫిక్ పోలీసుల నుంచి సహాయం పొందవచ్చు.
మీకు అత్యవసర పరిస్థితులలో ప్రమాదం ఎదురైనప్పుడు లేదంటే భయాందోళనలకు గురైనప్పుడు 112 కి ఫోన్ చేసి పోలీసులు సహాయం తీసుకోవచ్చు. అలాగే మన కళ్ళ ముందు ఎవరైనా మహిళలు గృహహింసకి గురైనప్పుడు లేదా మనమే గృహహించకే గురవుతున్నప్పుడు 1090 లేదా 1091 నెంబర్ కి కాల్ చేయడం ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చు. అలాగే ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ లీక్ అయినప్పుడు 1906 కి ఫిర్యాదు చేసి తక్షణ పరిష్కారం పొందవచ్చు.
End of Article