Ads
కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పార్టీ పది సంవత్సరాలు పాటు నిర్విరామంగా పాలన సాగించింది. 2023 ఎన్నికల లో కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని భావించారు కానీ అనుకోని పరిణామాల మధ్య ఓటమిపాలైంది ఈ పార్టీ. ఎక్కడో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణ లో బీఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకతని తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ బాగా సక్సెస్ అయింది.
Video Advertisement
ఈ ఎన్నికలలో కేసీఆర్ 40 సంవత్సరాల తర్వాత ఓటమి చవి చూడటం అనేది గమనించాల్సిన విషయం. ఈయన రాజకీయ ప్రస్థానంలో 14 సార్లు వరుస విజయాన్ని చవిచూసిన ఘనత దక్కించుకున్నారు కేసీఆర్. నిజానికి ఈ ఎన్నికలలో గెలిచి దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన తొలి సీఎం గా నిలవాలి అనుకున్న కేసీఆర్ కు నిరాశ మిగిలింది. అయితే ఇక్కడ బాధపడవలసిన మరొక విషయం ఏమిటంటే చాలా స్వల్ప ఓట్ల తేడాతో నలుగురు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ నాలుగు సీట్లని కోల్పోయింది.
5000 వోట్ల లోపు మెజారిటీతో నాలుగు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది పార్టీ 39 స్థానాల్లో గెలవగా నాలుగు స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాల అవటంతో గులాబీ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి. నిజానికి దేవరకద్ర నియోజకవర్గంలో అయితే దాదాపు విజయం ఖాయం అనుకునే సమయానికి స్వల్ప తేడాతో పరాజ్యం పాలయ్యింది.
ఇక జుక్కల్, బోధన్, ఖానాపూర్ నియోజకవర్గాలలో కూడా అదే స్వల్ప తేడాతో సీట్లని కోల్పోయింది బీఆర్ఎస్.
#1. జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతు షిండే కి 63337 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి టీ.లక్ష్మీకాంత రావుకు 64489 ఓట్లు వచ్చాయి. కేవలం 1152 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది.
#2. దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వేంకటేశ్వర రెడ్డికి 87159 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీ.మధుసూదన్ రెడ్డికి 88551 ఓట్లు వచ్చాయి. కేవలం 1392 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది.
#3. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ కి 63901 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.సుదర్శన్ రెడ్డికి 66963 ఓట్లు వచ్చాయి. 3062 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది.
#4. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కి 54168 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్మ బొజ్జుకి 58870 ఓట్లు వచ్చాయి. 4702 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది.
ఓటమికి కారణాలను సమీక్షించటానికి కేసీఆర్ అప్పుడే మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో విజయ పతాకం ఎగురవేసిన కాంగ్రెస్ డిసెంబర్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతుంది. కొసమెరుపు ఏమిటంటే ఎన్నికలలో ఓడిపోవడంతో ఏమాత్రం ఆలోచించకుండా బీర్ఎస్ పార్టీలోంచి బయటికి వచ్చేస్తున్నారు జంపింగ్ జపాంగులు.
End of Article