Ads
నాచురల్ స్టార్ నానికి క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. దసరా మూవీతో నాని తనలో ఉన్న మాస్ యాంగిల్ బయట పెట్టాడు. దసరా మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి వసూలు సాధించింది. అలాగే దసరా మూవీ ఓటిటి రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి. ఇదిలా ఉంటే నాని తాజాగా నటించిన హాయ్ నాన్న చిత్రం నేడు విడుదలైంది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి కూడా మంచి స్పందన లభించింది. సెన్సార్ సభ్యులు సినిమా అని అభినందించారని టాక్ బయటకు వచ్చింది. అప్పటి నుండి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే తాజాగా ప్రీమియర్స్ లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని హిట్ గా ప్రకటించేశారు. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందనేది ఇండస్ట్రీ టాక్. సుమారు 35 కోట్లు మేరా బిజినెస్ జరిగిందట.
Video Advertisement
తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుందని అంటున్నారు. సినిమా చూసి ఏడవకుండా ఎవరు బయటికి రారు అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మేకర్స్. నాని కూడా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు. అయితే తాజాగా హాయ్ నాన్న మూవీ ఓటిటి రైట్స్ షాక్ గురి చేసేలా అమ్ముడయ్యాయి.
ఈ సినిమాలో సకానికి పైగా పెట్టుబడి ఓటిటి రైట్స్ ద్వారా నిర్మాతకు వచ్చేసింది. ఈ లెక్కన చూసుకుంటే థియేటర్ లో బ్రేక్ ఈవెన్ అయితే చాలు నిర్మాతకు మంచి లాభాలు వచ్చినట్లే అని చెబుతున్నారు. హాయ్ నాన్న మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమాకు ఏకంగా 37 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. దీన్ని బట్టి చూస్తే నాని మార్కెట్ ఏ రేంజ్ కి పెరిగిపోయిందో అర్థమవుతుంది.
End of Article