NITHIN: నితిన్ గ్రాఫ్ అంతగా పడిపోయిందా..? షాక్ అవుతున్న అభిమానులు..!

NITHIN: నితిన్ గ్రాఫ్ అంతగా పడిపోయిందా..? షాక్ అవుతున్న అభిమానులు..!

by Mounika Singaluri

Ads

టాలీవుడ్ లో విభిన్నమైన కథ అంశాలతో ఎంటర్టైన్ చేసే యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం అతని గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది అన్న టాక్ వినిపిస్తోంది.. ఇది నిజమా అంటే.. అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. గత కొద్ది కాలంగా నితిన్ కెరీర్ లో మంచి సక్సెస్ అందుకున్న చిత్రం లేదు. ఎప్పటికప్పుడు హిట్ మూవీ కోసం ప్రయత్నిస్తున్నా రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. ఈ సంవత్సరం మాచర్ల నియోజకవర్గం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎక్స్పెక్ట్ చేసిన రిసల్ట్ అందుకోలేకపోయాడు నితిన్.

Video Advertisement

ఈ మూవీ తర్వాత బాగా లాంగ్ గ్యాప్ తీసుకొని.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో ప్రజెంట్ టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రీ లీల నటించింది. మూవీకి సంబంధించిన ట్రైలర్లో బ్యాక్ టు బ్యాక్ కామెడీ డైలాగ్స్ మూవీ పై బజ్ పెంచాయి. శ్రీ లీల మాస్ స్టెప్స్ తో ఉన్న సాంగ్ కూడా మంచి ట్రెండింగ్ అయింది. దీంతో మూవీ భారీ అంచనాల మధ్య విడుదల అయింది కానీ మొదటి రోజే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఊహించిన ఫలితాన్ని అందుకోవడంలో ఈ మూవీ కూడా ఫెయిల్ అయింది అని అర్థం అయిపోతుంది.

extra ordinary man review

నితిన్ చివరిగా మంచి సక్సెస్ అందుకున్న చిత్రం భీష్మ. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఏకంగా 6.42 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తిరిగి మళ్లీ ఈ రికార్డును నితిన్ బ్రేక్ చేయలేకపోతున్నాడు. మరోపక్క రోజురోజుకీ నితిన్ క్రేజ్ తగ్గుతోంది అని అనిపిస్తుంది.

రీసెంట్గా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ భీష్మ మూవీ తో సమానంగా లేక అంతకంటే హైయెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే అంచనాలను తారుమారు చేస్తూ..1.51 గ్రాస్ వసూళ్లతో సరిపెట్టుకుంది ఈ మూవీ. నితిన్ కెరీర్లో అత్యంత తక్కువ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ మూవీకే దక్కుతాయి. మూవీ కామెడీ పరంగా బాగున్న నాని హాయ్ నాన్న ఎమోషనల్ టచ్ ని తట్టుకోలేకపోయింది.. అందుకే ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.


End of Article

You may also like