Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు పుష్ప పార్ట్ కోసం ఇండియా తో పాటు మిగతా దేశాలు వారు కూడా ఎదురు చూస్తున్నారు. పుష్పలో తన అద్భుతమైన నటనకి గాను మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించారు. తన పాత్ర కోసం ఎంతటి కష్టానికి అల్లు అర్జున్ సిద్ధపడతారు. అయితే అల్లు అర్జున్ డాన్సులు, నటన, ఫైటింగులే కాకుండా మరో విషయంలో అభిమానులు మనసు గెలుచుకుంటున్నారు…!
Video Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలైందంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆ సినిమాని అభినందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇవేమీ లెక్కచేయకుండా చిన్న సినిమా దగ్గర నుండి ఎంత పెద్ద సినిమా అయినా సరే విజయం సాధిస్తే తన అభినందనలు తెలియజేస్తారు. వీలైతే సినిమా టీం ని పిలిచి కంగ్రాచ్యులేట్ చేస్తారు.
తాజాగా సెన్సేషనల్ హిట్ అయిన బేబీ మూవీ టీంని అయితే ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయించి మరి అభినందించారు. అలాగే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన రణబీర్ కపూర్ యానిమల్ మూవీ పైన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించారు అల్లు అర్జున్. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాని సినిమా పైన అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.
హాయ్ నాన్న సినిమా హార్ట్ టచ్చింగ్ గా ఉందని హీరో నానికి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఇలా అల్లు అర్జున్ ప్రతి తెలుగు సినిమాకి అభినందనలు తెలపడం నిజంగా ఆయన మంచి మనసుకు నిదర్శనం అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.
End of Article