Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండక్కి మంచి కనెక్షన్ ఉంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికి రావాలని చూస్తూ ఉంటాయి. సంక్రాంతిలో వచ్చే ఓపెనింగ్స్ గాని బిజినెస్ గాని వేరేగా ఉంటుంది. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా సంక్రాంతి పండగకి రావాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సర సంక్రాంతికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు అందచేస్తూ ఉంటాయి. ఉన్న థియేటర్లనే పంచుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం విపరీతమైన పోటీ ఉండేలా కనిపిస్తుంది. వరుస పెట్టి పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికి విడుదల అవడానికి సిద్ధమవుతున్నాయి. అందులో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం వెంకటేష్ నటించిన సైంధవ్ ,రవితేజ నటిస్తున్న ఈగల్, నాగార్జున నటిస్తున్న నా సామిరంగ, తేజ సజ్జ హనుమాన్ ఈ స్ట్రైట్ తెలుగు సినిమాలన్నీ కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇదే కాకుండా రెండు మూడు డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి విడుదలవుతున్నాయి.
ఒకేసారి ఎన్ని సినిమాలు విడుదలవుతే థియేటర్లు దొరకడం కూడా కష్టమే. ఇందులో ఎక్కువ శాతం థియేటర్లన్నీ స్టార్ హీరోలకి వెళ్ళిపోతాయి. ఇంత కాంపిటీషన్ లో కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ సినిమాకి ఊహించినంత కలెక్షన్స్ రావు. అన్ని సినిమాలు ఒకేసారి రావడం కన్నా కొన్ని సినిమాలు వాయిదా వేసుకుంటే మంచిదని సినీ విశ్లేషకులు అంటున్నారు. మేం తగ్గమంటే మేం తగ్గమని ఎవరికి వారు మొండి పట్టుకుని కూర్చున్నారు. సంక్రాంతి దగ్గర పడితే కానీ ఇందులో వచ్చే సినిమాలు ఏవి,ఆగే సినిమాలు ఏవి అనేది ఒక స్పష్టత రాదు.
End of Article