Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కేజిఎఫ్ సీరియస్ డైరెక్ట్ చేసిన ప్రశాంతని నీ సినిమాకి దర్శకుడు ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథగా దీన్ని చెబుతున్నారు. అయితే రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ విడుదల చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నారు.
Video Advertisement
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు ఇది చూస్తుంటే మొన్న విడుదల అయిన యానిమల్ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ నే ఇచ్చింది. ఏ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా యానిమల్ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసింది.
రికార్డు కలెక్షన్స్ తో ఇండియా వైడ్ దూసుకుపోతుంది. ఇప్పుడు సలార్ సినిమాని కూడా యానిమల్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సలార్ కూడా ఏ సర్టిఫికెట్ వచ్చిందని ఈ సినిమా కూడా సంచలన విజయం సాధిస్తుందని ప్రభాస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏ సర్టిఫికెట్ అనేది కేవలం వైలెన్స్ ను చూసి ఇస్తున్నారు తప్ప ఇందులో వేరే అంశాలు ఏమీ లేవని మూవీ టీం చెబుతుంది. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే ఏ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయో అంటూ ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా సరే సినిమా ఇండియాలో నెలకొన్న రికార్డులను తిరగ రాయడం ఖాయంగా చెబుతున్నారు. ప్రభాస్ ని ఫుల్ మాస్ అవతార్ చూసి చాలా రోజులైంది. ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని అంటున్నారు.
End of Article