Ads
.మెగాస్టార్ చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకి పోటీ ఇచ్చే విధంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి సినిమాకి తనను తాను మేక్ ఓవర్ చూసుకుని ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం మెగా 156 సినిమా కోసం చిరంజీవి సిద్ధమవుతున్నారు.
Video Advertisement
అయితే తాజాగా చిరంజీవిని తారక్ కాలేజీ కుర్రాడిలా ఉన్నారు అంటూ కాంప్లిమెంట్ చేశారు. తారక్ అంటే ఎన్టీఆర్ అనుకున్నారేమో… అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను పరామర్శించేందుకు చిరంజీవి హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ కేటీఆర్ చిరంజీవి రిసీవ్ చేసుకున్నారు. ఆ సందర్భంలో కేటీఆర్ చిరంజీవిని చూసి అచ్చం కాలేజీ కుర్రాడిలా ఉన్నారంటూ కాంప్లిమెంట్ చేశారట.
కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారకరామారావు అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి కేటీఆర్ ని ముద్దుగా తారక్ పిలుస్తారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి కేసీఆర్ సమక్షంలో చెప్పుకొచ్చారు. రాజకీయంగా గాని, సినిమా రంగంలో గానీ, వ్యక్తిగతంగా గాని ఎవరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే చిరంజీవి వారిని పరామర్శించి మాట్లాడి రావడం ఎప్పటినుంచో జరుగుతుంది. చిరంజీవి అందరూ అజాతశత్రువు అని అంటూ ఉంటారు. నిజంగా నిన్న చిరంజీవి లుక్కు చూస్తే కాలేజీ కుర్రాడు లాగానే ఉన్నారు. టీ షర్ట్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
End of Article