మిల్కీ బ్యూటీ తమన్నా 33 ఏళ్ల వయసు వచ్చిన కూడా ఇప్పటికీ కుర్ర కారుని అలరిస్తూనే ఉంది. ఏడాది బోళా శంకర్, జైలర్ సినిమాల్లో అమ్మడు మెరిసింది. జైలర్ సినిమాలో ఐటెం సాంగ్ తమన్నా కి మంచి పేరు తీసుకువచ్చింది. దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న తమన్నా చిన్న పెద్ద అందరు సరసన నటించింది.

అయితే ఇటీవల తమన్నా చేస్తున్న సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్ అవుతున్న కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మలయాళం తమిళ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నటిగా తమన్న ఎప్పుడూ కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారాల మీద దృష్టి సారిస్తుంది.

ఇంకో చేత్తో ప్రకటనలు కూడా చేసుకుంటూ పోతుంది. సినిమా అవకాశాలు తగ్గిన కూడా ప్రకటనలతో తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెత లాగా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ఇటీవల తన ప్రేమ విషయం కూడా బయటకు వ్యక్తపరిచింది. నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది త్వరలో ఆమె ఇద్దరం పెళ్లి చేసుకున్నట్లు కూడా ప్రకటించింది. ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో కూడా నటించారు. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయవర్మ నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈ మిల్కీ బ్యూటీ ఇదే తరహాలో కొనసాగితే మరికొన్ని రోజులపాటు ఆడియన్స్ ని ఆదరించడం ఖాయం.
