రేవంత్ రెడ్డిని కలిసిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

రేవంత్ రెడ్డిని కలిసిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

by kavitha

Ads

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సాధారణంగా  గవర్నమెంట్ మారగానే, గత ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న ఆఫీసర్లను మార్చడం, కొత్త ఆఫీసర్లను తీసుకుంటారనే విషయం తెలిసిందే.

Video Advertisement

కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ సీపీగా నియమించారు. పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను సైతం మార్చే యోచనలో గవర్నమెంట్ ఉందని సమాచారం. సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కలిశారు. ఆ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆమ్రపాలిని సీఎంఓలోకి  తీసుకుంటునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కీలక ఆఫీసర్ల మార్పులు జరుగుతున్నాయి. పలువురు ఆఫీసర్లను ఇప్పటికే బదిలీ చేస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో సీఎంపేషీలో కొత్త ఆఫీసర్లు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్రపాలి కాట 1982లో ఆంధ్ర ప్రదేశ్‌ విశాఖపట్నంలో వెంకట్ రెడ్డి కాటా, పద్మావతి దంపతులకు నవంబరు 4న జన్మించారు. ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారు. విశాఖపట్నంలో సాయి సత్య మందిర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జేఈఈ లో ఉత్తీర్ణత సాధించి, చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పూర్తి  చేసింది. ఆమ్రపాలి 2010 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 39 వ ర్యాంక్‌ సాధించి, ఐఏఎస్ అధికారిణి అయింది. ఐఏఎస్ కు ఎంపికయిన అతి తక్కువ వయస్కులలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు.
2013లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా నియమితులైన ఆమె, 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పనిచేసింది.  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో ఆమ్రపాలి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళ ఐఏఎస్‌ ఆఫీసర్. “యంగ్ డైనమిక్ ఆఫీసర్” గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో పీఎం  కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి తెలంగాణలో సీఎంఓలోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మందు ఎందుకు తాగరంటే.? ఈ కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.!


End of Article

You may also like