Home Filmy Adda ఇంకా 70 రోజులు షూటింగ్ ….ఎప్పుడు పూర్తి చేస్తావ్ స్వామి…?

ఇంకా 70 రోజులు షూటింగ్ ….ఎప్పుడు పూర్తి చేస్తావ్ స్వామి…?

by Sainath Gopi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రారంభమై రెండు సంవత్సరాల పైన అవుతుంది. మధ్యలో శంకర్ ఇండియన్ 2 సినిమా కోసం షిఫ్ట్ అవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే గేమ్ చేంజర్ షూటింగ్ దాదాపు పూర్తయిందని నిర్మాణ సంస్థ చెబుతున్న కూడా అందులో వాస్తవం లేదని తెలుస్తుంది.

mega fans tensed about gamechanger movie..!!

గేమ్ చేంజర్ ఇంకా 70 రోజులు షూటింగ్ మిగిలి ఉందంట. ఇది తెలుసుకున్నాం రామ్ చరణ్ ఫాన్స్ శంకర్ పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు షూటింగ్ పూర్తి చేస్తావు స్వామి అంటూ మండిపడుతున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని ప్రకటించి దాన్ని వాయిదా వేశారు. మళ్ళీ దాని ప్రకటన కూడా లేదు. ఇలా రామ్ చరణ్ ఫాన్స్ సహనంతో శంకర్ ఆడుకుంటున్నారని అంటున్నారు. గేమ్ చేంజర్ కంటే వెనకాల మొదలు పెట్టిన ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ పూర్తి చేసేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతుంది. గేమ్ చేంజర్ అయితే ఇంకా రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.

You may also like