Ads
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. అయితే డిసెంబర్ 9 11 ప్రారంభించినప్పుడు జీరో టికెట్ మీద ఎటువంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే మహిళలు ప్రయాణించే అవకాశం కల్పించారు.
Video Advertisement
అయితే డిసెంబర్ 16 నుండి బస్సులో ప్రయాణించే మహిళలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని సంస్థకు సహకరించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించాలంటే.. తమ వెంట ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు. గుర్తింపు కార్డు లేని ఎడల తెలంగాణ మహిళలైనా సరే టికెట్ కంపల్సరిగా తీసుకోవాలని అన్నారు. లేకపోతే 500 జరిమాన విధిస్తామని తెలియజేశారు. మొదటి రోజు కావడంతో డిసెంబర్ 16వ తారీఖున ఎటువంటి కార్డు లేకపోయినా మహిళలను బస్సుల్లో ప్రయాణించేలా చేశారు. ఇకపై అటువంటి సౌకర్యం ఉండదని తప్పనిసరిగా తమతో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని తెలిపారు
End of Article