Home Filmy Adda నితిన్ సినిమాలో నటించిన ఈ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా…?

నితిన్ సినిమాలో నటించిన ఈ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా…?

by Sainath Gopi

తెలుగు ఇండస్ట్రీలో ఈమధ్య తెలుగు అమ్మాయిలకి అవకాశాలు బాగా వస్తున్నాయి. హీరోయిన్ పాత్రలకి ఇంపార్టెంట్ పాత్రలకి తెలుగు అమ్మాయిలను తీసుకుంటున్నారు. తాజాగా నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో ఒక తెలుగు అమ్మాయి కీలకపాత్రలో నటించింది.

సినిమాలో నితిన్ నీ బావ బావ నువ్వు సక్సెస్ అయితే నన్ను వదిలేయవు కదా అంటూ క్యూట్ క్యూట్ గా డైలాగులు చెబుతూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే
దాక్షి గుత్తికొండ.

Evaru meelo koteeswarulu promo actress dakshi guttikonda

ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటీ ఇంతకు ముందు పలు సినిమాల్లో కూడా నటించింది రామ్ గోపాల్ వర్మ సంస్థ నుండి వచ్చిన కరోనా వైరస్ సినిమాలో దాక్షి నటన అందరినీ ఆకట్టుకుంది అమ్మడి నటనకి రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కూడా కురిపించారు. సినిమాలే కాకుండా పలు కమర్షియల్ యాడ్ లలో కూడా దాక్షి నటించింది. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లో కూడా మెరిసింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో దాక్షి నటనకి మంచి మార్కులే పడ్డాయి. కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

You may also like