అంగన్‌వాడీ కార్యకర్తల విచిత్రమైన నిరసన చూసారా..? ఏం చేసారంటే..?

అంగన్‌వాడీ కార్యకర్తల విచిత్రమైన నిరసన చూసారా..? ఏం చేసారంటే..?

by Mounika Singaluri

Ads

గత 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.

Video Advertisement

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలు, ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేశారు. ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలతో ఆందోళనలను హోరెత్తించారు. కార్యాలయాల వద్దే వంటా వార్పు చేసి,రోడ్డు మీదే భోజనాలు చేశారు. చెవిలో పూలు పెట్టుకుని, మోకాళ్లమీద నిలబడి, ఒంటి కాళ్ల మీద నిలబడి ఇలా వినూత్న రీతుల్లో నిరసన తెలిపారు.

anganwadi women strike

అంగన్వాడి స్కూల్ అన్ని మూసేసి రోడ్లమీదకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంగన్వాడి కార్యకర్తలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల వారందరూ ముందుకు వచ్చారు.
అయితే తమకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాటిట్యూడ్ అందించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

anganwadi women strike

ఒక అంగన్వాడీ కార్యకర్తకి అమ్మోరు పూనినట్లుగా వేప రొట్టలతో ఊగిపోతుంటే పక్కన ఉన్న కార్యకర్తలు అమ్మవారిని తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారు. ఏమేమి కోర్కెలు అని అడగగా తమకి జీతాలు పెంచాలని 26,000 చేయాలని అడిగారు. ఈసారి కూడా తన కోరికలు తీస్తే ఒక్క అవకాశం అని వచ్చిన నికు రెండోసారి కూడా ఓట్లేసి మరో అవకాశం ఇస్తామంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ప్రభుత్వం కొన్ని ప్రతిపాదన తీసుకొచ్చిన వాటికి అంగన్వాడీలు ఒప్పుకోవడం లేదు.తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే అని పట్టుపడుతున్నారు.

watch video :

ALSO READ : RTC బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం…ఇక మీదట ఇది తప్పనిసరి..లేదంటే టికెట్ తీసుకోవాలి.!


End of Article

You may also like