Ads
తల్లితండ్రుల తర్వాత పిల్లలకు మంచిని నేర్పిస్తూ, విద్యాబుద్ధులు భోధించేది గురువు. అయితే కొందరు టీచర్లు కేవలం విద్యార్ధులకు పాఠాలను చెప్పడమే కాకుండా, వారి అభివృద్ధి పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్దను చూపుతుంటారు.
Video Advertisement
ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు టీచర్లు క్రమశిక్షణ నేర్పించాల్సి వస్తుంది. ఓ పాఠశాల హెడ్ మాస్టార్ గురువుగానే కాకుండా విద్యార్థులకు అవసరమైన సేవలను చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు స్వయంగా హెయిర్ కట్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ హెడ్ మాస్టార్ ఎవరో? ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఉన్న హుకుంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ లో సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు నుండి వచ్చిన గిరిజన పిల్లలు ఈ స్కూల్ లోనే చదువుకుంటూ, అక్కడే ఉంటున్నారు. ఆ పాఠశాలలో టీచర్లు, సిబ్బంది కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వారందరినీ అందరికీ నడిపించే హెడ్ మాస్టార్ మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆయన తన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ, ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.
ఈ పాఠశాలలో బాలాజీ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ ఆ పాఠశాలలోని విద్యార్థులను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. వారి తల్లితండ్రులు తమ పై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అక్కడి పిలల్లకు విద్య, వసతి సౌకర్యాలు చూస్తూ, ఓ కుటుంబ పెద్దలా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెడ్ మాస్టార్ లా కాకుండా, స్టూడెంట్స్ కు అవసరమైన సేవలను సైతం చేస్తున్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని బోధిస్తూ, స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఆ క్రమంలో స్వయంగా తానే విద్యార్థుల యూనిఫామ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బార్బర్ రాకపోవడంతో, జుత్తు పెరిగిపోయిన విద్యార్థులకు వారి సమ్మతితో హెడ్ మాస్టార్ బాలాజీ కత్తెర పట్టుకుని క్షురకుడులా మారి ఖాళీ సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారు. ఆయన సందర్భాన్ని బట్టి స్టూడెంట్స్ కి అవసరమైన సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు అందరు పాఠశాలలో క్రమశిక్షణతో కనిపించాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలా సేవ చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ వెల్లడించారు.
Also Read: అంగన్వాడీ కార్యకర్తల విచిత్రమైన నిరసన చూసారా..? ఏం చేసారంటే..?
End of Article