Ads
ప్రస్తుతం శీతాకాలం ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఏజెన్సీ ఏరియాలలో మైనస్ డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఈ తీవ్రమైన చలికి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు.
Video Advertisement
రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది.
తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఎల్లో ఎలెర్ట్ జారీ చేసింది. ఈ ఏడు జిల్లాల్లోనూ రాబోయే మూడు రోజులు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతను నమోదు అవుతాయి అని తెలియజేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మరి తక్కువగా టెంపరేచర్లు నమోదయ్య అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలో ఉన్న 23 జిల్లాల్లో గత కొద్దిరోజులుగా 15 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలో నమోదు అవుతున్నాయి. ఈ తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా రాష్ట్రంలోని ప్రజలు ఓనికిపోతున్నారు. రాత్రి సమయంలో బయటికి రావాలంటే జడుస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది
End of Article