Ads
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు.
Video Advertisement
ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగిలిన షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో తండ్రీ కొడుకుల పాత్రలు పోషిస్తున్నాడు.
శ్రీకాంత్, సునీల్ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ సినిమాలంటే భారీతనానికి పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆయన భారీ లెవెల్ లో ఈ సినిమాని తరికెక్కిస్తున్నారు. ఒక్క సాంగ్ కి 20 కోట్లు మేరకు ఖర్చు పెడుతున్నారని వినిపిస్తుంది. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన దాన్ని పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పైన తాజాగా ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తుంది. ఈ సినిమాని 2024 సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారట. ఈ న్యూస్ విని రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకర ప్రస్తుతం గేమ్ చేంజర్ తో పాటు ఇండియన్ 2 మూవీ కూడా ఒకేసారి తలకెక్కిస్తున్నారు ఆ మూవీ కూడా 2024 లోనే విడుదల కానుంది
End of Article