Ads
చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాకి హిట్ టాక్ వచ్చింది. సలార్ సినిమా ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే సినిమాకి ఎంత మంచి టాక్ వచ్చిందో, అంటే నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. సినిమా చాలామందికి నచ్చలేదు.
Video Advertisement
ఎలివేషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా సలార్ సినిమా మీద అభిప్రాయం తెలుపండి అంటూ కోరాలో ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకి అలోక్ నంద ప్రసాద్ గారు ఈ విధంగా సమాధానం చెప్పారు.
“ఈ దర్శకరత్నంగారి మునుపు రెండు సినిమాలు చూసాను. నిజానికి చూడాల్సొచ్చింది కానీ అప్రస్తుతం. రెండూ పిసరంతైనా నచ్చలేదు, అదీ అప్రస్తుతం. కొందరు కన్విన్స్ చెయ్యజూసారు బలమైన ఎమోషనంటా… అయితే పకోడీ ఎలివేషన్లపై పెట్టిన ధ్యాస మరి దేనిపైనా పెట్టలేదని నా అభిప్రాయం కానీ అప్రస్తుతం. దర్శకుడి ప్రతిభపై ఈషణ్మాత్రమైనా నమ్మకం కుదర్లేదు కానీ అప్రస్తుతం. గత కొన్నేళ్ళుగా హీరో గారి కటౌట్‌కి తగిన హిట్టు పడ్లేదు కానీ అప్రస్తుతం.”
“దీని కోసమని ఠావులకు ఠావులు కంటెంట్ రాసుకున్నాడట, మరందులో ఒక్క పేజీ అయినా ఎత్తుకొచ్చినది కాకపోతే బాగుండేది కానీ అప్రస్తుతం. రాజమౌళి గారిని లాక్కొచ్చి ఆల్మోస్ట్ భజన ప్రోగ్రామొకటి పెట్టేరు సరిగ్గా విడుదలకు ముందే… మరి ఆయన సినిమాల్లో తర్కం లేని సీనులెన్నున్నా అటేపు ధ్యాస మరలనివ్వని కథనం ఉంటుందన్న కనీస ఇంగితం లాక్కోలేకపోయారు కానీ అప్రస్తుతం.”
“First Principles అంటే ఏమిటో తెలుసుకునేంత విజ్ఞత సదరు నీలకంఠంగారికుండాలనుకోవటం అత్యాశే కానీ ఒక పని చెయ్యటానికి ప్రణాళిక ఎంత ముఖ్యమో ముందా ప్రణాళికను సొంతంగా రూపొందించుకునేంత ప్రజ్ఞను పెంపొందించుకోవటం అంతే అవసరమన్నది ఆయనకెక్కడా తారసపడలేదేమో. అయినా అప్రస్తుతం. ఇంతకంటే దరిద్రమింకేముంటది అనుకున్నానో లేదో అచ్చంగా సింహాసనాలాటలోలాగే జాంబీ రౌడీలను కూడా దింపేసాడు మానుభావుడు.”
“ఆ వందల మందని పది నిముషాల్లో కసకసా నరికేయచ్చని తెలియక పాపం జాంబీ రెడ్డి అని మంచి కథనంతో ఓ మోస్తరు సినిమా కూడా తీసాడో పిచ్చిమారాజు. ఇదీ అప్రస్తుతం. కటౌట్ బాగుండేది కంటెంట్ ఉన్నోడిది మాత్రమేనని తెలుసుకోలేని నా ఆ వివేకానికి సాహో అనిపించేలా పడ్డ గట్టి దెబ్బే ప్రస్తుతం. ఇంతోటి సోదికి మళ్ళా సీక్వెల్లొకటి”.
“ఇంతకంటే రాధే రాధే జపిస్తూ పెప్సీతో పాయసం చేసుకుని, అందులోకి పిజ్జా మీదావకాయేసుకుని నంజుకుంటా ఉప్పు నీళ్లు నముల్తా కూకోవచ్చింట్లో. నాకు నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. ఇతిః నా సుత్తి బాధ సమాప్తం.” అంటూ రాశారు. ఏదేమైనా కూడా ఇది చాలామంది అభిప్రాయం. దాంతో చాలామంది అలోక్ నంద ప్రసాద్ గారి కామెంట్ కి ఏకీభవిస్తూ రిప్లై ఇస్తున్నారు.
End of Article