Ads
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలో ఏ బస్సులు ఖాళీగా ఉండడం లేదు ఎక్కువ శాతం మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Video Advertisement
తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అన్న విషయం ఆర్టీసీ ఎండి సజ్జనర్ దృష్టికి వచ్చింది.దీనిపై స్పందించిన ఆయన మహిళలందరిని ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనార్ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు.
తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. అలాగ కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు.ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను కేవలం అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతామని ఆయన తేల్చి చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు.
End of Article