Ads
చెన్నైలో పుట్టినరోజు నాడే ఒక మహిళా టెక్కీ దారుణంగా మరణించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె మాజీ క్లాస్‌మేట్ ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుస్తోంది. గొలుసుతో కట్టేసి, పెట్రోల్ పోసి సజీవదహనం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
Video Advertisement
పోలీసుల దర్యాప్తులో మృతురాలు చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న నందిని అని తెలిపారు. ఆమెను చంపిన వ్యక్తి మృతురాలి మాజీ లవర్ వెట్రిమారన్ అని సమాచారం. పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మదురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. చెన్నైలోనే తన బంధువుల ఇంట్లో నందిని ఉంటోంది. ఆమెకు పదవతరగతి నుండి పాండి మహేశ్వరితో స్నేహం ఉంది. పాండి మహేశ్వరి చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని, లింగమార్పిడి తరువాత కూడా వారి సహజీవనం కొనసాగిందని తాంబరం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.
అయితే నందిని రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి, పగ పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం నందిని బర్త్ డే కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. గుడికి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. చివరికి పొన్మార్ రోడ్ సమీపంలో ఫ్లాట్ కి నందిని తీసుకెళ్ళాడు. ప్లాట్‌కి తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్చేస్తానని చెప్పి, నందిని కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత చేతులు, కాళ్ళు కట్టేసి, బ్లేడ్ తో మణికట్టు, మెడ కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుండి పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read: విద్యార్థుల కోసం ఈ ఉపాధ్యాయుడు చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..! అసలు విషయం ఏంటంటే..?
End of Article