గురూజీ ఇది నీ స్థాయి కాదు…. ఇకనైనా మారండి…….!

గురూజీ ఇది నీ స్థాయి కాదు…. ఇకనైనా మారండి…….!

by Sainath Gopi

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ నీ ముద్దుగా గురూజీ అని పిలుచుకుంటారు. ఆయనకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. ఆయన చేసే రచనలు, తెలుగు సాహిత్యం పట్ల ఆయనకున్న అనుభవం అంతా ఇంతా కాదు. గురూజీ మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. ఆయన సినిమాల్లో కూడా డైలాగులు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి అలాగే పాటల్లో సాహిత్యం కూడా విలువలను చాటే విధంగా ఉంటుంది. చాలాసార్లు తెలుగు సాహిత్యం గురించి, తెలుగు రచయితలు గురించి ఎంతో గొప్పగా చెప్పుకోచ్చారు గురూజీ.

Video Advertisement

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాని చేస్తున్నారు ఇది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది తాజాగా ఈ సినిమా నుండి కూర్చుని మడత పెట్టే అనే సాంగ్ విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఒక డైలాగును తీసుకుని ఈ పాటను రూపొందించారు. అయితే ఈ పాట విన్న నెటిజన్లు గురూజీ పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఒక బూతు డైలాగులోని మాటలు తీసుకుని పాట పెట్టడం గురూజీ ఎంతవరకు సమంజసం అంటూ మాట్లాడుతున్నారు.

ఉండేకొద్ది మీ స్థాయి తక్కువ చేసుకునే విధంగా పనిచేయవద్దు అని సూచిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎంత మాస్ పాటైనా సరే సాహిత్య విలువలు ఉండేలా చెప్పొచ్చు. గురూజీ కానీ, మహేష్ బాబు గానీ ఈ పాటని ఎందుకు చేశారు ఎలా చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపైనైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.


End of Article

You may also like