Ads
రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతాను అందట.ఇది ఒక సినిమా డైలాగ్ కానీ ప్రస్తుత సమాజానికి సరిగ్గా ఈ డైలాగ్ సరిపోతుంది. ఎందుకంటే నేటి రోజులలో బంధాలకి, బంధుత్వాలకి విలువలకి,ఆప్యాయతలకి, అనుబంధాలకి అసలు విలువ లేకుండా పోయింది. డబ్బు కోసం ఒక మనిషి ఎంత కింది స్థాయికి అయినా దిగజారటానికి వెనకడుగు వేయడం లేదు అలాంటి సంఘటన ఒకటి కర్ణాటకలోని దావణగెరె లో జరిగింది.
Video Advertisement
అసలు ఏం జరిగిందంటే దావణగెరె కు చెందిన స్నేహ అనే 25 ఏళ్ల మహిళ 2 ఏళ్ల క్రితం ప్రశాంత్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దావణగెరె లో ఓ అద్దె ఇంట్లో కాపురానికి కూడా దిగారు. అనంతరం రెండు నెలల క్రితం తాను గర్భవతినని పుట్టింటికి వెళ్లాలని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగిన స్నేహ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ప్రశాంత్ స్నేహ ఒకప్పుడు చెప్పిన చిరునామాకు వెళ్లి చూడగా ఆమె అక్కడ లేదు.
ఆ తర్వాత కొద్ది రోజులకు స్నేహ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసిన ప్రశాంత్ ఒక్కసారిగా నివ్వెర పోయాడు. స్నేహ మరొక వ్యక్తిని వివాహం చేసుకొని ఫోటో పోస్ట్ చేయడంతో కంగుతిన్న ప్రశాంత్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. అయితే ఈ విచారణలో స్నేహ ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది.
మొదట మేలుకొటే నివాసి మహేష్ తో పెళ్లి జరిగింది తర్వాత అతనిని విడిచిపెట్టి బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది తర్వాత ప్రశాంత్ ని వివాహం చేసుకుంది ఇప్పుడు అతనిని వదిలిపెట్టి రఘు అనే వ్యక్తిని నాలుగో పెళ్లి చేసుకుంది. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు స్నేహను అరెస్టు చేశారు. నాలాగా మరొకరు మోసపోకూడదని కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.
End of Article