SAINDHAV CENSOR REVIEW: “సైంధవ్” మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది… సినిమా ఎలా ఉందంటే..?

SAINDHAV CENSOR REVIEW: “సైంధవ్” మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది… సినిమా ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

Ads

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో 75వ సినిమా గా రూపొందించిన సైంధవ్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ జోరుగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ ను పొందింది.శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో వెంకటేశ్ మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా కధ విషయానికి వేస్తే….వెంకటేశ్ కూతురు ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతుందని, ఆ వ్యాధి చికిత్స కోసం 17 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ అవసరం అవుతుందని ఆ ఇంజక్షన్ విలన్ కు కూడా అవసరం కావడంతో ఒకటే ఇంజక్షన్ ఉండటంతో ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు కి దగ్గర పోలికలు ఉంటాయని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. వెంకటేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించారు. తాజాగా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారట. దీంతో మేకర్ సార్ హ్యాపీ ఫీలయ్యారని వినిపిస్తుంది. కచ్చితంగా హిట్ కొడతామని డైరెక్టర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like