Ads
2024 నూతన సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది కొత్త కొత్త విషయాలను ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరంలో ఫ్రెష్ గా మొదలు పెడితే సంవత్సరం అంతా ఉత్సాహభరితంగా పనిని చేస్తామని భావిస్తూ ఉంటారు.అయితే చాలామందికి ఏం చేయాలో అనేదానిపై స్పష్టత ఉండదు. కొందరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే, మరికొందరు పాత అలవాట్లను వదిలేయాలని అనుకుంటారు. అయితే ఏ పనులను ప్రారంభించాలి ఏ అలవాటులను ఎలా వదిలేయాలి అనే దాని పైన ఒకసారి వివరంగా చూస్తే…
Video Advertisement
1. లక్ష్యం పెట్టుకోండి:
ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు కొత్త సంవత్సరంలో దాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని వాటిని సాధిస్తూ మీరు అనుకుంటున్న పెద్ద టార్గెట్ ను చేరుకోండి. ఒక కొత్త ప్రణాళికతో ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టండి.
2. ఇన్వెస్ట్మెంట్స్:
ఎవరైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే గుర్తుండేందుకు కొత్త సంవత్సరంలో మొదలు పెడుతూ ఉంటారు. మీకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అవ్వని, పొలాలు, బంగారం, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా ఈరోజు నుంచి మొదలు పెట్టండి.
3. హెల్దీ డైట్:
బాడీ మీద కంట్రోల్ పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని మలుచుకునేందుకు న్యూ ఇయర్ ని వాడుకోండి. ఈరోజు నుండి ఏం తినాలి?ఎంత తినాలి? ఎలా తినాలి? ఏ టైం కి తినాలి? అని దానిపైన ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
4. చెడు అలవాట్లకి దూరంగా ఉండండి:
చాలామంది చెడు అలవాట్లను మానేయాలనుకున్న మానుకోలేరు. అయితే కొత్త సంవత్సరం నుండి వాటిని క్రమక్రమంగా మానేస్తూ దూరంగా జరగండి. ఈరోజు మొదలుపెట్టి దాన్ని ప్రతిరోజు కొనసాగించండి.
5. డైరీ రాయండి:
ఇదివరకు రోజుల్లో నిత్యం డైరీ రాసేవారు, కానీ ఇప్పుడు ఎవరూ రాయడం లేదు.అయితే ఒక డైరీని పెట్టుకుని మీరు చేసిన పనులను చేయాలనుకున్న పనులను స్పష్టంగా రాసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితం ఎలా సాగుతుందో మీకు అవగాహన వస్తుంది. తర్వాత ఎలా మార్చుకోవాలని స్పష్టత కూడా లభిస్తుంది.
End of Article