Ads
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల విషయంలో నూతన సంస్కరణలు మొదలుపెట్టింది. కార్డులో కరెక్షన్ లు, అలాగే కొత్త వారి చేరికపై మార్గ నిర్దేశకాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రేషన్ కార్డు గురించి కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు కేవైసీపై కొత్త అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో దాదాపు 70 శాతం పూర్తి అయిందని అధికారులు తెలియజేశారు.
Video Advertisement
ఈకేవైసీలో మేడ్చల్ మాల్కజిగిరి జిల్లా 87.8 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఇంకా ఎవరైనా చేయనివారుంటే జనవరి 31లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గురించిన కేంద్రం ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని కోరుతోంది.
ఇందుకు సంబంధించి పలుమార్లు గడువును పొడగించింది. అయితే తాజాగా ఈ గడువును మరోసారి పొడగించింది. ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది. రేషన్ కార్డులో పేరున్న వారు చాలా మంది చనిపోయారు. వారు చనిపోయినా వారి పేరున కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. అందుమూలన ఈ కేవైసీ పూర్తయితే ఇటువంటి వాటికి చెక్ పెట్టినున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణలో ఎక్కడ చూసినా మీసేవ సెంటర్లు ఎదురుగుండా క్యూ లైన్ లలో జనాలు బార్లు తీరుతున్నారు.
End of Article