Ads
రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు, అందులోనూ ముఖ్యంగా బండి నడిపేటప్పుడు వేగం పాటించరాదు అని చెప్తారు. ఖాళీగా ఉన్న రోడ్ల మీద అతివేగంతో వెళ్లే వాహనాలని మనం చూస్తూనే ఉంటాము.
Video Advertisement
అలా వేగంగా వెళుతున్నప్పుడు ఎదురుకుండా ఏదైనా వస్తే సడన్ గా బ్రేక్ వేయడం కష్టం అయ్యి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల అలాంటి ఒక సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఈనాడు కథనం ప్రకారం, విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇద్దరు అబ్బాయిలు బుల్లెట్ బండి మీద వెళుతూ మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయారు. ఒక కుటుంబం వారి ఇంటి పెద్దని కోల్పోయింది. నందమూరి నగర్ కి చెందిన 47 సంవత్సరాలు ఉన్న వేమూరి సత్యనారాయణ జాతీయ రహదారుల గుత్తేదారుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య పేరు ఇహితాదేవి. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చికెన్ తెచ్చేందుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపైన సత్యనారాయణ బయటికి వెళ్లారు.
నూజివీడు రోడ్ లో ఉన్న బ్రహ్మంగారి గుడి వద్దకు వచ్చిన సమయంలో మితిమీరిన వేగంతో ఓ 12 సంవత్సరాలు ఉన్న బాలుడు బుల్లెట్ బండి నడుపుతూ వచ్చి సత్యనారాయణ బండిని ఢీకొట్టాడు. దాంతో సత్యనారాయణ బండి పక్క భాగం విరిగిపోయి, బ్యాటరీ పడిపోయి దూరంగా పడింది. సత్యనారాయణ నేల మీద పడ్డారు. సత్యనారాయణకి బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
స్థానికులు సత్యనారాయణ ఇంటికి ఫోన్ చేసి, ఆయన భార్యకి ఈ సమాచారం అందించారు. సత్యనారాయణ భార్య ఇహితాదేవి, వారు ఉంటున్న అపార్ట్మెంట్ వాసులతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. భర్తని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సత్యనారాయణ అక్కడే ప్రాణాలను కోల్పోయారు. మరొక పక్క బుల్లెట్ బండి మీద వస్తున్న బాలుడికి 12 సంవత్సరాలు వయసు ఉంటుంది.
అతని వెనుక కూర్చున్న అబ్బాయికి కూడా దాదాపు ఇంచుమించు ఇదే వయసు ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత వారిద్దరూ అక్కడే కూర్చుండిపోయారు. ఈ సంఘటన తర్వాత బుల్లెట్ బండి ముందు భాగం ధ్వంసం అవ్వడంతో పాటు, లైట్ విరిగిపోయి, సేఫ్టీ గార్డ్ వంగిపోయింది. బుల్లెట్ నడిపిన బాలుడి మీద, అబ్బాయికి బుల్లెట్ ఇచ్చిన యజమాని మీద అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : TELANGANA RATION CARD: రేషన్ కార్డు దారులకు ముఖ్య గమనిక… జనవరి 31 ఆఖరి తేదీ…!
End of Article