Ads
టీవీ షోలు లేదా సినిమాలు అన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం చాలా విషయాలు చేయాల్సి వస్తుంది. నిజ జీవితంలో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, అలా డాన్సులు చేయడం, ఫైటింగ్ లు చేయడం, లేదా డైలాగ్స్ చెప్పడం వంటివి చేయరు. కానీ వారి వృత్తి కోసం ఇవి అన్నీ చేయాల్సి వస్తుంది. టీవీ ఇండస్ట్రీలో కూడా సీరియల్స్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
Video Advertisement
ప్రోగ్రామ్స్ లో కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం కామెడీ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఈ కామెడీ అతిగా అయ్యి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇటీవల అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది కూడా స్టార్ హోదాలో ఉన్న సెలెబ్రిటీల మధ్య ఇలాంటిది జరిగింది.
ఇది వాళ్ళు కామెడీ కోసం చేసినా కూడా, ఇది ఆల్రెడీ స్క్రిప్టెడ్ అయినా కూడా, చూసే ప్రేక్షకులకు మాత్రం ఇది నచ్చలేదు. వివరాల్లోకి వెళితే, యాంకర్ సుమ తన కొడుకు రోషన్ సినిమా అయిన బబుల్ గమ్ ప్రమోషన్స్ కోసం ఈటీవీ ఢీ షో కి వెళ్లారు. అక్కడ సుమకి, హైపర్ ఆదికి మధ్య ఒక చిన్న కామెడీ స్కిట్ జరిగింది. అందులో భాగంగా సుమ నోట్లో నీళ్లు పోసుకుని బయటికి ఉమ్మేయాలి. కింగ్ సినిమాలో బ్రహ్మానందం స్టైల్ లో, “నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసేది ఏంటి?” అని అర్థం వచ్చేలాగా డైలాగ్ చెబుతూ సుమ ఆ నీళ్ళని హైపర్ ఆది మీదకి ఉమ్మేశారు.
హైపర్ ఆది ఒక బకెట్ అడ్డం పెట్టుకున్నా కూడా, సుమ ఉమ్మిన నీళ్లు హైపర్ ఆది ముఖం మీద, దుస్తుల మీద పడ్డాయి. సాధారణంగా ఇలాంటి కామెడీ జబర్దస్త్ లాంటి షోస్ లో చూస్తూనే ఉంటాం. కానీ ఒక స్టార్ యాంకర్ హోదాలో ఉన్న వ్యక్తిని ఇలాంటి ఒక కామెడీ సీన్ చేయించడం అనేది కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ అంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది. ఎంత కామెడీ చేసినా కూడా అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ఇలాంటి స్క్రిప్ట్ ఇవ్వడంతో సుమ కూడా ఏం చేయలేకపోయారు. దాంతో తప్పు అసలు ఈ స్క్రిప్ట్ రాసిన వాళ్లది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా రాకింగ్ స్టార్ సాక్షి తన్వర్..
End of Article