Ads
వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన కొడుకు రాజారెడ్డి పెళ్లి వేడుకకు అన్న జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా అన్నా చెల్లెలు ఇద్దరు అరగంట పాటు భేటీ అయ్యారు.
Video Advertisement
అయితే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు కేవలం కుటుంబ వ్యవహారాలే మాట్లాడుతున్నారా లేదంటే రాజకీయ పరంగా ఏమైనా చర్చలు జరిగాయ అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
అయితే అన్నా జగన్ కు వదిన భారతిలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల పెళ్ళికి తప్పకుండా రావాలని వాళ్ళని ఆహ్వానించి ఆపై మీడియాతో మాట్లాడకుండా డైరెక్ట్ గా గన్నవరం ఎయిర్పోర్ట్ కి కుటుంబ సభ్యులతో సహా వెళ్ళిపోయింది షర్మిల. అప్పుడు మీడియాతో మాట్లాడాల్సిందే అని విలేకరులు పట్టుబట్టగా సీఎం జగన్ గారిని నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రమ్మని ఆహ్వానించాను జగన్ సానుకూలంగా స్పందించారు.
పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ నా కుమారుడు పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని మీడియాకు వెల్లడించారు షర్మిల. అయితే రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదు అని చెప్పకనే చెప్పింది షర్మిల. అయితే షర్మిల తన అన్న దగ్గరికి తన కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి తో పాటు మరికొందరు బంధువులతో కలిసి వెళ్ళింది అంతేగాని వెంట తల్లి వై ఎస్ విజయమ్మ రాలేదు.
దీనికి గల కారణాలు తెలియ రాలేదు. కానీ వైయస్ విజయమ్మ కి కొడుకు జగన్ తో ఉన్న విభేదాలు అందుకు కారణం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షురాలు పదవికి కూడా విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కూతురు వైఎస్ఆర్ టీపీ పార్టీ పెడుతున్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ కూతురికి అండగా నిలవాలని చెప్పుకొచ్చింది విజయమ్మ. ప్రస్తుతం ఆమె కూతురుతోనే ఉంటుంది
End of Article