Home Filmy Adda ఓ వైపు ప్రభాస్ లాగా.. మరోవైపు మహేష్ బాబులాగా ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా..?

ఓ వైపు ప్రభాస్ లాగా.. మరోవైపు మహేష్ బాబులాగా ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా..?

by Mohana Priya

తరతరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలా కొంత మంది నటులు అయితే, మరి కొంత మంది సినిమా రంగంలోనే మరికొన్ని విభాగాల్లో పని చేస్తున్నారు. అయితే, నటుల కొడుకు నటులు అవడం అనేది మనకి తెలిసిందే.

అలా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ పేరుని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరొక జనరేషన్ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో కొంత మంది ఇప్పటికే పెద్ద వాళ్ళు కూడా అయిపోయారు.

this boy looks like prabhas and mahesh babu 1

అలా ఇటీవల ఒక హీరో కొడుకు పిక్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చింది. ఈ అబ్బాయిని చూశారా? ఒకవైపు నుండి ప్రభాస్ లాగా? మరొకవైపు నుండి మహేష్ బాబు లాగా ఉన్నాడు కదా? ఈ అబ్బాయిని మనం చిన్నప్పుడు చాలా సినిమాల్లో చూసాం. ఎవరో గుర్తుపట్టారా? ఈ అబ్బాయి సుధీర్ బాబు కొడుకు. సుధీర్ బాబుకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారా? ఇతను సుధీర్ బాబు పెద్ద కొడుకు. ఈ అబ్బాయి పేరు చరిత్ మానస్. ఈ అబ్బాయి భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రలో నటించాడు.

this boy looks like prabhas and mahesh babu

ఈ అబ్బాయి సర్కారు వారి పాట సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో కూడా నటించాడు. ఇటీవల చరిత్ మానస్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఈ ఫోటోలు చూసిన వాళ్ళు అందరూ కూడా హైట్ లో జూనియర్ ప్రభాస్, ఫేస్ ఫీచర్స్ లో జూనియర్ మహేష్ బాబులాగా ఉన్నాడు అని అంటున్నారు. అయితే మరో మూడు సంవత్సరాల తర్వాత చరిత్ మానస్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన చరిత్ మానస్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. బయట ఈవెంట్స్ కి చాలా దూరంగా ఉంటారు. ఇలా ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటారు.

You may also like