Home Filmy Adda సడన్ గా OTT లోకి వచ్చిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

సడన్ గా OTT లోకి వచ్చిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

by Mohana Priya

ఓటీటీలోకి రోజుకి ఒక కొత్త సినిమా వస్తూ ఉంటుంది. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తక్కువ ఏమీ రావట్లేదు. గతంలో కంటే ఇప్పుడు ఓటీటీలకి రెస్పాన్స్ ఇంకా పెరిగింది. భాషా బేధం లేకుండా అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అందుకే మేకర్స్ కూడా అన్ని భాషల్లో సినిమాలు విడుదల చేస్తున్నారు. కాబట్టి కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఓటీటీలోకి వస్తూ ఉంటే, కొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. అలా ఇటీవల ఒక సినిమా వచ్చింది.

movie which is streaming on ott

ఆ సినిమా పేరు ది ట్రయల్. ఈ సినిమాలో యుగ్ రామ్, స్పందన పల్లి, వంశీ కోటు ప్రధాన పాత్రలో నటించారు. నవంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయండి. సినిమా కథ విషయానికి వస్తే, సబ్ ఇన్స్పెక్టర్ అయిన రూప ఆమె భర్త అజయ్ కలిసి ఒక అపార్ట్మెంట్లో వారి మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటూ ఉంటారు.

movie which is streaming on ott

అయితే అజయ్ కాలుజారి బిల్డింగ్ మీద నుండి కింద పడి చనిపోతాడు. అజయ్ ని రూప చంపింది అనే ఒక అనుమానం వస్తుంది. తన భర్తది ఆ-త్మ-హ-త్య అని రూప చెప్తుంది. అసలు అజయ్ ఎలా చనిపోయాడు? ఎవరు అయినా చంపేశారా? లేదా తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో నడుస్తుంది. ఈ సినిమాకి రామ్ గన్నీ దర్శకత్వం వహించారు.

movie which is streaming on ott

ఎస్ఎస్ ఫిలిమ్స్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు ఈ సినిమాని నిర్మించారు. థియేటర్లలో విడుదల అయినప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను అంత పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందుబాటులో ఉండడంతో సినిమాని విపరీతంగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఉదయ్ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

You may also like