Ads
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట విన్న అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈనెల 22వ తేదీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా అయోధ్యలో జనవరి 22వ తేదీన రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక జరగనున్న విషయం తెలిసిందే.
Video Advertisement
ఈ వేడుకలో లక్షలాదిమంది హిందువులు పాల్గొనబోతున్నారు. సామాన్యులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు 22న అయోధ్యకు చేరుకోనున్నారు. ఇందుకు అధికారులు రైలు విమాన సౌకర్యాలను కూడా కల్పించారు.
ప్రస్తుతం ఈ అయోధ్యకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అయోధ్య విషయంలోనే తాజాగా గాయని చిత్రపై నెటిజన్స్ దాడికి దిగుతున్నారు. అసలేం జరిగింది ఎందుకు చిత్రపై నెటిజన్స్ మండిపడుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రముఖ సినీ నేపథ్య గాయని కె.ఎస్.చిత్ర విడుదల చేసిన వీడియో సందేశం వివాదాస్పదంగా మారింది. కేరళలోని పాలక సీపీఎం సహా కాంగ్రెస్, భాజపా గాయనికి మద్దతుగా నిలువగా, నెటిజన్లలో ఓ వర్గం ఆమెపై తీవ్రమైన సైబర్ దాడికి దిగింది.
ప్రాణప్రతిష్ఠ రోజున శ్రీరాముడి కీర్తనలు ఆలపించండి. సాయంత్రం వేళ ఇళ్లలో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించండి అని ప్రజలను కోరుతూ రెండు రోజుల కిందట వీడియో సందేశం విడుదల చేసిన చిత్ర లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ దాన్ని ముగించారు. దీంతో నెటిజన్లలో ఒక వర్గం ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ తీవ్ర విమర్శల దాడికి దిగగా, మరో వర్గం తన మనోభావాలను తెలిపే హక్కు చిత్రకు ఉందని అండగా నిలిచింది. మొత్తానికి ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే చిత్రాకి మద్దతు తెలిపే వారి కంటే దాడి చేసే వారి సంఖ్యను ఎక్కువగా ఉంది.
End of Article