సితార చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది..? ఇంత చిన్న పిల్ల మీద ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు..?

సితార చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది..? ఇంత చిన్న పిల్ల మీద ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు..?

by Mohana Priya

Ads

కాలం మారింది. మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారారు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్ ఉన్నారు. పెద్దవాళ్ళకి తెలిసిన అన్ని విషయాలు కూడా వారికి చిన్న వయసులోనే తెలిసిపోతున్నాయి.

Video Advertisement

సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వీళ్ళలో స్టార్ హీరోల పిల్లలు ఏమీ మినహాయింపు కాదు. అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది సితార ఘట్టమనేని.

Sitara-Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కూతురు అయిన సితార, సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడికి అయినా వెళ్ళినప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు కూడా తీసి పెడుతూ ఉంటుంది. ఇంత చిన్న వయసులో అంత టాలెంట్ ఉండడం చిన్న విషయం కాదు. అయితే సితార ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా కొంత మంది పిల్లలకి సైకిల్స్ పంచింది.

అలాగే ఇంకొక మాల్ లో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ప్రోగ్రాంకి వెళ్ళింది. అయితే ఇప్పుడు సితార మీద కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం సితార కొంత మంది అనాధ పిల్లలకి గుంటూరు కారం సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా అన్నాక మనుషులు ఎవరో తెలియదు కాబట్టి ఏది పడితే అది రాస్తూనే ఉంటారు.

mahesh babu-trivikram next movie story resembelms that salman movie..??

అలా చాలా మంది, ” కుటుంబ కథా చిత్రాన్ని అనాధ పిల్లలకి చూపించడం ఏంటి?” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంత మంది అయితే, “ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నారు” అని అంటున్నారు. ఇందులో వెటకారం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక చిన్న పిల్ల ఇలాంటి ఒక పని చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి, ఇలా కామెంట్స్ చేయడం ఏంటి? మరొకపక్క సితారని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. “ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు రావడం అనేది చాలా గొప్ప విషయం” అంటున్నారు.


End of Article

You may also like