Home Filmy Adda “ఇన్నాళ్లు సహించాం…త్వరలో మీ అహంకారం అణచి”…జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ బహిరంగ హెచ్చరిక.!

“ఇన్నాళ్లు సహించాం…త్వరలో మీ అహంకారం అణచి”…జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ బహిరంగ హెచ్చరిక.!

by Mohana Priya

సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల, ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను తీసేయమని బాలకృష్ణ ఆదేశించారు. అందుకు కారణం ఆ ఫ్లెక్సీల మీద స్వాగతం సుస్వాగతం అని రాసి ఉండడం అని అన్నారు.

అయితే ఈ ఫ్లెక్సీలని తొలగించడం అనే విషయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని ఆవేదనకి గురి చేసింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక ఉత్తరం రాశారు. అందులో ఈ విధంగా రాసి ఉంది.

“జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ హెచ్చరిక

Date :- 18-01-2024

అన్న కోసం మేమంతా :-

1. విషయం :-  అందరికీ నమస్కారం… తమ అభిమానుల కోసం తపన పడే నటుల్లో మన తారక్
అన్న ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు… కానీ ఆయన ప్రతి నిమిషం అవమానాలకు
గురి అవుతూ ఉంటే ఆయన అభిమానులుగా మాకు గుండెల్లో నిప్పుల కొలిమి రగులుతోంది… అయినా సరే ఆయన గత నెలలో మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు…కొద్దిగా సంయమనం పాటించండి అని… ఇన్నాళ్ళు మేము అదే సంయమనం తో ఉన్నాం…కానీ ఇప్పుడు కుదరదు…. “దేవర ఇన్నాళ్ళు నీ మీద జరిగిన మానసిక దాడి చాలు…ఇక వాళ్ళకి తెలియాలి దేవర అభిమానుల సత్తా…

jr ntr fans letter

మేమెంతో అభిమానంతో మా దేవర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను బహిరంగంగా బాలయ్య తీసేయండి.. ఇప్పుడే తీసేయండి అని అక్కడున్న తెలుగుదేశం వాళ్ళకి చెప్తుంటే తారక్ అన్న ని ఎంతలా ద్వేషిస్తున్నారో తలచుకొని బరువెక్కిన హృదయంతో కళ్ళు కన్నీటితో కారు మబ్బులు కమ్మేసాయ్.. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఆ నాడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిని, దివంగత
నందమూరి హరికృష్ణ గారిని మరణం అంచుల్లో ఉన్నా వెంటాడారు…

double hatrick hits by these tollywood heros..

ఇదే బాలయ్య అప్పట్లో చంద్రబాబు చెప్పులు మోస్తూ వీర విహారం చేశాడు… ఇప్పుడు తారక్ అన్నని భారీగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం… ఇన్నాళ్ళు సహించాం…. త్వరలో మీ
అహంకారం అణచి.. మీలోని మదాన్ని వెంటాడబోతున్నాం… ఈసారి బ్యాలెట్ బాక్సులు
భయంతో భీతేక్కుతాయి.. ఆంధ్ర రాష్ట్రం తారక రాముడి అడ్డా అని చాటి చెప్పకపోతే
దీంతల్లి…ఈసారి మీకు మాత్రం రాజకీయ బిచ్చగాళ్ళను చేయడం నిశ్చయం.. అందుకు ప్రతీ
ఎన్టీఆర్ అభిమాని ప్రతిన పూనుతున్నాడు…

expensive things owned by junior NTR

మా అందరిలో ఇప్పుడు ఆగ్రహించిన ఉగ్ర నరసింహుడు ఆవహించి ఉన్నాడు…మీ అందరినీ వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం…. జై ఎన్టీఆర్ ! జై జై ఎన్టీఆర్!!

అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం.”

అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లేఖ రాశారు.

ALSO READ : అయోధ్య రామ మందిరం వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెళ్లట్లేదు..? కారణం ఇదేనా..?

You may also like