Home Filmy Adda SITHARA GATTAMANENI: ఇంస్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తూ…మహేష్ బాబు కూతురు నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.?

SITHARA GATTAMANENI: ఇంస్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తూ…మహేష్ బాబు కూతురు నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.?

by Sainath Gopi

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది సితార ఘట్టమనేని.సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కూతురు అయిన సితార, సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడికి అయినా వెళ్ళినప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు కూడా తీసి పెడుతూ ఉంటుంది. ఇంత చిన్న వయసులో అంత టాలెంట్ ఉండడం చిన్న విషయం కాదు. అయితే సితార ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంది.comments on sitara ghattamaneni

ఈమధ్య ఏకంగా ఒక భారీ ప్రాజెక్టుకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. పీఎంజే జ్యువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలి అడుగు వేసిన సితార, అదే విషయం గురించి తన ఆనందాన్ని పంచుకుంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి రెమ్యూనరేషన్ తల్లి లేదా తండ్రికి ఇచ్చారా? అని ఒక ప్రశ్న తనకు ఎదురవగా.. దానికి సమాధానముగా ఈ సూపర్ స్టార్ కూతురు తన మొదటి రెమ్యునరేషన్ ఛారిటీకి ఇచ్చానని బదులిచ్చింది.

Sitara-Ghattamaneni ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు. కానీ, ఆమె పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. పలు రకాల ప్రొడక్ట్స్ తమని ప్రమోట్ చేయాలంటూ సితారను అప్రోచ్ అవుతూ ఉంటారు. వాటి ప్రమోషన్స్ తో సితార గట్టిగానే సంపాదిస్తున్నారని చెప్పచ్చు.  నెలకు ముప్పై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

You may also like