ఆమెకి ఇద్దరు పిల్లలు… అతను వరుసకి తమ్ముడు.! ఒకే ఇంట్లో ఇద్దరు ఆత్మహత్య..ఏమయ్యుంటుంది.?

ఆమెకి ఇద్దరు పిల్లలు… అతను వరుసకి తమ్ముడు.! ఒకే ఇంట్లో ఇద్దరు ఆత్మహత్య..ఏమయ్యుంటుంది.?

by Harika

Ads

రాజేంద్రనగర్ లో ఇటీవల జరిగిన సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, ఈనాడు డాట్ నెట్ కథనం ప్రకారం, సోమేష్, అతని భార్య అయిన 28 ఏళ్ల చామంతి అత్తాపూర్ డివిజన్ కేశవ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

Video Advertisement

ఐదు సంవత్సరాల క్రితం సోమేష్, తన సోదరుడు నరసింహులుతో కలిసి, గుమ్మకొండ కాలనీలో ఒక ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో మొదటి అంతస్తులు నరసింహులు, తన భార్య స్వప్న, వారి పిల్లలతో కలిసి ఉంటారు.

shekhar chamanti incident hyderabad

కింద అంతస్తులో, సోమేష్, చామంతి, వారి కుమార్తె, కుమారుడితో కలిసి నివాసం ఉంటారు. సోమేష్ షాపులు ఆఫీస్ లకి నీటి సరఫరా చేస్తారు. చామంతి ఇళ్లలో పని చేస్తారు. వీరిద్దరికి 2010 లో పెళ్లి జరిగింది.  చామంతి సూర్యాపేట జిల్లా కసరబాద్ కి చెందినవారు కాగా, సోమేష్ యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందినవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం నరసింహులు బావమరిది శేఖర్, తన బావ అయిన నరసింహులు వద్దకి వచ్చి నివసించసాగారు.

shekhar chamanti incident hyderabad

శేఖర్ తన ఇద్దరు బావలతో ఎంతో స్నేహంగా ఉంటాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన శేఖర్, డిగ్రీ పూర్తి చేశాడు. శేఖర్ వయసు 25 సంవత్సరాలు. శేఖర్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శేఖర్ చామంతికి వరుసకి తమ్ముడు అవుతాడు. మంగళవారం ఉదయం నాడు నరసింహులు, సోమేష్, స్వప్న సూర్యాపేటలో ఒక దశదినకర్మ కార్యక్రమానికి వెళ్లారు. ఉదయం చామంతి తన పిల్లలని స్కూల్ కి పంపించారు. ఉదయం 8 గంటలకి పిల్లల్ని స్కూల్ కి పంపించిన చామంతి, 10:30 గంటల సమయంలో తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు.

shekhar chamanti incident hyderabad

మధ్యాహ్నం 3:30 కి స్కూల్ నుండి వచ్చిన పిల్లలు తలుపు కొట్టడం మొదలు పెట్టారు. ఎంతకీ ఎవరు వచ్చి తీయలేదు. దాంతో కిటికీలో నుండి వాళ్ళు చూశారు. అప్పుడు చామంతి ఫ్యాన్ కి ఉరి వేసుకొని కనిపించారు. పక్కింటి వాళ్ళకి చెప్పడంతో, వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొట్టి, లోపలికి వెళ్లి చూడడంతో, హాల్ లో చామంతి, బెడ్ రూమ్ లో శేఖర్ ఉరి వేసుకొని కనిపించారు. ఒకే ఇంట్లో ఇద్దరు ఉరి వేసుకోవడం అనేది కలకలం రేపింది.  అసలు వీరిద్దరూ ఇలా చేయడానికి గల కారణం ఏంటి అనేది బయటికి రాలేదు. వీరిద్దరూ ఎందుకు కలిశారు. చామంతి ఇంటికి శేఖర్ వచ్చే సమయానికి సోమేష్ ఇంట్లో లేరు.

girl suicide 3

representative image

భర్త ఇంట్లో లేనప్పుడు చామంతి ఇంటికి శేఖర్ ఎందుకు వచ్చాడు? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ఇలాంటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నలు అన్ని వ్యక్తం అవుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వారిద్దరిది బలవన్మరణం అని ధ్రువీకరించి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ ఇలా ఎందుకు చేశారు అనే విషయం మీద ఇంకా ఎవరికీ స్పష్టత రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు శోకసంద్రంలో మునిగిపోయారు.

ALSO READ : 2017 లో పురుషుడిగా మారిన లేడి కానిస్టేబుల్.! 2020 లో పెళ్లి… ఇప్పుడు తండ్రి.! అసలేమైందంటే.?


End of Article

You may also like