Home Filmy Adda AYODHYA RAM MANDIR: అయోధ్యలో చిరంజీవి ఫ్యామిలీతో పి.టి.ఉష..వైరల్ అవుతున్న ఫోటో.!

AYODHYA RAM MANDIR: అయోధ్యలో చిరంజీవి ఫ్యామిలీతో పి.టి.ఉష..వైరల్ అవుతున్న ఫోటో.!

by Sainath Gopi

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం, బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలనుండి 7000 మంది విశిష్ట అతిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలామంది ప్రముఖులు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి అయోధ్య వెళ్లారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అయితే ఈ వేడుకకు హాజరవ్వడం పూర్వజన్మ సుకృతం అని చిరంజీవి చెప్పగా, తనకు తెలియకుండానే కళ్ళంట నీళ్లు వచ్చేసాయని పవన్ కళ్యాణ్ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక రామ్ చరణ్ లైఫ్ లో ఒక్కసారి వచ్చే అవకాశం అంటూ ప్రాణప్రతిష్ట గురించి గొప్పగా చెప్పారు. అయితే ఈ వేడుకకు హాజరైన సమయంలో చిరంజీవి కుటుంబ సభ్యులతో పలువురు ఫోటోలు దిగారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తమిళ హీరో ధనుష్ కూడా చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఫోటో దిగారు. తాజాగా తెలుగు ఆవిడ, ప్రముఖ క్రీడాకారిణి పి.టి.ఉష కూడా రాంచరణ్, చిరంజీవి,సురేఖలతో కలిసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. అనంతరం వారితో కలిసిన దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలో తెలుగు వారందరూ బాగా వైరల్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక పబ్లిక్ ఈవెంట్ లో పి. టి ఉషా కూడా కనిపించడంతో ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

You may also like