Home Filmy Adda “నెరు”లో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? నెక్స్ట్ సెన్సేషన్ ఈ అమ్మాయే.!

“నెరు”లో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? నెక్స్ట్ సెన్సేషన్ ఈ అమ్మాయే.!

by Sainath Gopi

వెండితెరపై వెలిగిపోవాలని చాలామంది హీరోయిన్స్ అడుగుపెడుతూ ఉంటారు. అయితే అవకాశం వచ్చిన తర్వాత దాన్ని చాలామంది సరిగ్గా సద్వినియోగం చేసుకోరు. ఒక హిట్ పడితే చాలు తర్వాత ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని మళ్లీ సైడ్ అయిపోతారు. ఉదాహరణకు మన తెలుగు హీరోయిన్ శ్రీ లీలా. ఒక హిట్ కొట్టిన తర్వాత వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుని ఇప్పుడు అవన్నీ ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకుంది.

కానీ మలయాళ హీరోయిన్స్ మనవాళ్ళల కాదు. ఆచితూచి సినిమాలు చేస్తూ ఉంటారు. మలయాళం లో అనస్వర రాజన్ అనే ఒక హీరోయిన్ ఉంది. ఆమెకి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇప్పడు ఆమె వయసు 21 సంవత్సరాలు. ఈ మూడు సంవత్సరాల నుండి 16 సినిమాల్లో నటించింది.ఆ 16 సినిమాలు కూడా దేనికదే ప్రత్యేకం. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. తాజాగా మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన నెరు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో మోహన్ లాల్ కి దీటుగా తన నటనతో చెలరేగింది. ఈ సినిమాను దృశ్యం సినిమా డైరెక్టర్ జీతూ జోసఫ్ తెరకెక్కించారు. ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అలాంటి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అంటే అనస్వర టాలెంట్ ఏంటో తెలుస్తుంది.

నెరు సినిమాలో అనస్వర నటన చూసిన ఎవరైనా సరే ఈమె త్వరలో స్టార్ హీరోయిన్ అవబోతుంది అని అనకమానరు.పాన్ ఇండియా లెవెల్లో ఆకట్టుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పగలరు. అందుకే సినిమా హీరోయిన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.

You may also like