Ads
భారతదేశంలో పండుగలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. అసలు భారతదేశంలో పండుగలను జరుపుకున్నంత బాగా ప్రపంచంలో ఇంక ఎక్కడా జరుపుకోరు. అలాంటి పండుగల్లో ఇటీవల ఇంకొక రోజు కూడా యాడ్ అయ్యింది.
Video Advertisement
అదే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు. ఆరోజు దేశం అంతా గర్వించదగ్గ రోజు. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన వారు, సినీ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. అయితే ఆరోజు జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీస్తోంది.
ఆరోజు కొంత మందికి బ్లాక్ డే అయ్యింది అని వార్త వచ్చింది. రామ మందిరం మీద పచ్చ జెండాలు ఎగరవేస్తున్నట్టు ఉన్న ఫోటోలు కొంత మంది వాట్సాప్ లో షేర్ చేశారు. అలా చేసిన ఒక వ్యక్తిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు సద్దాం హుస్సేన్ అని తెలిసింది. ఈ సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి కర్ణాటక జిల్లాలోని ధారావాడకి చెందిన తడకోడ గ్రామంలో నివసిస్తాడు. తను అయోధ్య రామ మందిరం మీద పచ్చ జెండాలు ఉన్నట్టు కొన్ని ఫోటోలు ఎడిట్ చేసి వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు.
దీంతో ఆగ్రహానికి గురైన హిందువులు, ధారావాడలోని ఈద్గా మైదానంలో ఉన్న గోపురాలను కూల్చి వేయడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయి జారిపోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యి ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. కర్ణాటక జోన్ ఐజీపీ అయిన వికాస్ కుమార్ ముస్లిం నాయకులతో చర్చలు జరిపి ఈద్గా మైదానంలో దెబ్బ తిన్న గోపురానికి మరమ్మతులు చేశారు.
అయితే రామ మందిరం ప్రారంభం అయిన తర్వాత అయోధ్య శ్రీరాముడి మందిరం మీద ఇలాగే పచ్చ జెండాలు పెట్టి ఎడిట్ చేసిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు అనే కారణంగా ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారు కూడా కర్ణాటక జిల్లాకి చెందిన వారు. ఇదే విధంగా రామ మందిరం మీద పచ్చ చండాలు పెట్టే ఎడిట్ చేసిన గదగ్ జిల్లాకి చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఇప్పుడు కర్ణాటక జిల్లాకు చెందిన మరొక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు. మరొక పక్క ధారావాడ ఎస్పీ డాక్టర్ గోపాల్ బకోడ్ మత పెద్దలతో చర్చలు జరిపి శాంతియుతంగా ఉండాలి అంటూ వారికి రిక్వెస్ట్ చేశారు.
End of Article