Ads
సాధారణంగా రోడ్డు వెడల్పు చేసే పనిలో భాగంగా, చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కానీ, లేదా షాపులను కానీ కూల్చివేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం రోడ్డు వెడల్పు పనిలో భాగంగా తన సొంత ఇంటిలో కూల్చేశారు. ఆయన మరెవరో కాదు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి.
Video Advertisement
మున్సిపాలిటీ అధికారులు ఇళ్లను కూల్చివేయమని ఆదేశం ఇవ్వడంతో, శనివారం రోజు తన ఇంటిని కూల్చేశారు. ఇదే రోడ్డు మీద ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ మాజీ మంత్రి అయిన షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. మరి ఈ విషయం మీద ఆయన ఎలా స్పందిస్తారో అని చూస్తున్నారు.
అయితే మరొక పక్క రోడ్డు వెడల్పుకి అడ్డుగా ఉంది అని సొంత ఇంటిని కూల్చివేసిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా రోడ్డు విస్తరించడం కోసం ఇల్లు కూల్చివేసేందుకు ఆ ఇళ్ల యజమానులు సహకరించాలి అని వారిని కోరారు. అప్పటి ప్లాన్ ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి రైల్వే గేట్ వరకు 80 అడుగుల విస్తీర్ణంలో రోడ్ నిర్మించాలి అని అనుకున్నారు.
అయితే, ప్రస్తుతం 30 అడుగుల రోడ్డు ఉంది. రోడ్డు విస్తరించడానికి వీలు లేకుండా చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్ళ ముందు షెడ్లు వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే రోడ్ విస్తరించడానికి ప్రజలు స్వచ్ఛందంగా వారే ముందుకు రావాలి అని వెంకట రమణారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం నాడు ఆర్ అండ్ బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తానే జేసీబీ దగ్గరుండి తన సొంత ఇంటిని కూల్చివేశారు.
పంచముఖి హనుమాన్ దేవాలయం కూడా ఇదే దారిలో ఉంది. ఆ ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తీర్ణం చేసే పనులు చేపట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల లోపు రోడ్డు మీద ఉన్న కుళాయి గుంటలు, షెడ్లని వారే స్వచ్ఛందంగా తొలగించి, రోడ్డు అభివృద్ధి కోసం సహకరించాలి అని ప్రజలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు మరొక 24 అడుగుల రోడ్డు అదనంగా నిర్మించాలి అని, ఈ పనులన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి కావాలి అని అధికారులని ఆదేశించారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన పనికి చాలా మంది ఆయనని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఈ రోజు మొదటగా తన ఇంటినే కూల్చి వేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు pic.twitter.com/kVz38wpA19
— Katipally Venkata Ramana Reddy BJP (@kvr4kamareddy) January 27, 2024
ALSO READ : గుడిలోకి వెళ్తే వేల ఖర్చు.. చర్చ్ కు, దర్గాకు వెళ్తే రూపాయి ఖర్చు రాదు ఎందుకు..?
End of Article