Home Filmy Adda షూటింగ్ సెట్ లోనే హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య..! అసలు ఏం జరిగిందంటే..?

షూటింగ్ సెట్ లోనే హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య..! అసలు ఏం జరిగిందంటే..?

by Sainath Gopi

కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో దర్శన్ ఒకరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కన్నడలోనే టాప్ స్టార్ అయ్యారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా దర్శన్ సినిమాలకి మాత్రం చాలా మంది అభిమానులు ఉంటారు.

ఇటీవల సలార్ సినిమా రిలీజ్ టైంలో తన సినిమా రిలీజ్ కూడా ఉంది. అప్పుడు తనది కన్నడ సినిమా అని, అలాంటిది సలార్ సినిమాకి ఎందుకు భయపడాలి అని అన్నారు. దర్శన్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.

hero darshan wife issue with heroine

అయితే, ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. దర్శన్ కి ఒక ఆవిడతో రిలేషన్ షిప్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఆమె కూడా హీరోయినే కావడం చర్చలకి దారి తీస్తున్న విషయం అయ్యింది. ఆమె పేరు పవిత్ర గౌడ. ఇటీవల పవిత్ర గౌడ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో దర్శన్ తో ఉన్న ఫోటో షేర్ చేసి, “ఇది 10 సంవత్సరాల బంధం. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. థాంక్యూ దర్శన్” అని రాసి ఒక పోస్ట్ షేర్ చేశారు.

hero darshan wife issue with heroine

అయితే ఈ పోస్ట్ దర్శన్ భార్య వరకు వెళ్ళింది అని సమాచారం. దర్శన్ భార్య విజయలక్ష్మి ఈ పోస్ట్ చూసి పవిత్ర గౌడ షూటింగ్ లోకేషన్ కి తనని తీసుకెళ్లమని అడిగారట. అక్కడికి వెళ్ళాక తన భర్తకి దూరంగా ఉండమంటూ పవిత్ర గౌడకి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ విషయం ప్రస్తుతం బయటికి వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది వారికి మాత్రమే తెలుసు. ఇంక సినిమాల విషయానికి వస్తే, దర్శన్ ఇటీవల హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ సినిమాకి పోటీగా కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఒక కన్నడ స్టార్ హీరో సినిమా మరొక సారి నిరూపించింది. కన్నడలో మంచి కలెక్షన్స్ రాబట్టింది.

https://www.instagram.com/reel/C2fhWmdP6Nj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

You may also like