Ads
ఇటీవల అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ఈ వేడుకకి వెళ్లారు. వారందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాలు అందాయి. దాంతో వారందరూ కూడా అయోధ్యకి వెళ్లి శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు.
Video Advertisement
వాళ్లు వెళ్తున్న వీడియోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వీరందరూ మాత్రమే కాకుండా మరుసటి రోజు ఒక వ్యక్తి రామ మందిరానికి ఎవరికీ తెలియకుండా ముసుగు వేసుకొని వెళ్లారు. ఆయన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.
ఎన్నో సంవత్సరాల నుండి హిందీలో ఎన్నో సినిమాలు చేసి అవార్డులు అందుకున్నారు. ఇటీవల తెలుగులో కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో కూడా నటించారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్ నటించారు. ఇటీవల రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు రామ మందిరానికి ముఖం కనిపించకుండా ముసుగు వేసుకొని వెళ్లారు. ఇదే విషయాన్ని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ విధంగా రాశారు.
ఈ విషయం మీద అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ, “దయచేసి చివరి వరకు చూడండి. నేను నిన్న ఆహ్వానితుడిగా రామ మందిరానికి వెళ్లాను. కానీ ఇవాళ అందరితో పాటు కలిసి గుడికి వెళ్ళాలి అని అనిపించింది. ఈ భక్తి సముద్రాన్ని చూసి నా మనసు ఉప్పొంగిపోయింది. భక్తుల ఆనందం, రాముడి మీద ప్రజలకి ఉన్న భక్తి బాగా కనిపిస్తోంది. నేను వెళ్ళిపోతున్నప్పుడు ఒక భక్తుడు నా చెవి దగ్గరికి వచ్చి, “అన్నా అలా ముసుగు వేసుకోవడం వల్ల ఏమీ జరగదు. రాముడికి తెలిసిపోయింది” అని అన్నారు. జైశ్రీరామ్” అని రాశారు.
అంతే కాకుండా వీడియోని కూడా షేర్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాల్లో పనిచేసిన అనుపమ్ ఖేర్, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాకుండా కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
watch video :
कृपया अंत तक देखे: कल मैं आमंत्रित अतिथि बनकर राम मंदिर गया था! पर आज सबके साथ चुपचाप मंदिर जाने का मन किया।भक्ति का ऐसा समंदर देखने को मिला कि हृदय गद गद हो उठा।लोगों का राम जी को देखने का उत्साह और भक्तिभाव देखते ही बन रहा था।जब मैं निकलने लगा तो एक भक्त हल्के से कान में बोला,… pic.twitter.com/S0O5X3TVSk
— Anupam Kher (@AnupamPKher) January 23, 2024
ALSO READ : సమ్మక్క సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..? దీనికి కారణం ఏంటంటే..?
End of Article