Ads
హైదరాబాద్ లో ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా తక్కువ ధరలకు ఎక్కువ ఆహారాన్ని అందిస్తున్నారు. వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ ను అందిస్తున్నారు. అది కూడా రోజువారీ కష్టపడుతూ పనిచేసేవారికి అందుబాటులో ఉండేలా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు.
Video Advertisement
ఇన్ అర్బీటాల్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ లో పదకొండు అయ్యిందంటే చాలు. అక్కడికి ఫుడ్ కోసం చాలామంది వస్తారు. సాయి కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఆహారం టేస్టీగా ఉండడం, తక్కువ ధరలకు ఎక్కువ ఆహారం ఇస్తుండడంతో వారి ఫుడ్ బిజినెస్ బాగా సాగుతోంది. వంట అంతా ఆమె చేస్తుంది. ఆమె మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు వంటలు చేసుకుని, 11 గంటలకు షాప్ ఓపెన్ చేస్తామని చెప్పారు.
సాయి కుమారి దగ్గర ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఈమె బాగా ట్రెండ్ అవ్వడంతో…అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎంతో మంది వెళ్లారు. ఎంతో మంది వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కూడా కట్టారు యూట్యూబ్ చానెల్స్. అయితే ఇప్పుడు ఈ పాపులారిటీ ఆమెకి పెద్ద కష్టం తెచ్చిపెట్టింది.
అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలనీ చాలామంది అక్కడికి బారులు తీశారు. దీంతో అక్కడ రద్దీ ఎక్కువైపోతంది. అక్కడికి వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేయడంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అక్కడ భోజనం అమ్మడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ట్రాఫిక్ జాం అవుతుందని రోడ్డుపై బిజినెస్ చేయడానికి అనుమతి లేదు అని పోలీసులు చెప్పారు. ట్రక్ లో నుండి ఫుడ్ దింపనివ్వకుండా ఆమెని అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసారు.
ట్రాఫిక్ పోలీసులు మరియు కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ బిజినెస్ ఎందుకు ఆపించట్లేదు. పబ్లిక్ ని మేము రమ్మని పిలిచామా.? మీడియాని మేము పిలిచామా? అంటూ అన్నారు. మాపై ఎందుకు కక్ష కడుతున్నారు అన్నారు. మీడియా వల్లే ఇలా జరిగింది కాబట్టి మీడియా వాళ్లే నాకు న్యాయం చేయాలని ఆమె అన్నారు.
End of Article