Ads
హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ తో ఫేమస్ అయ్యారు సాయి కుమారి. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు కూడా ఈమె ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టారు.
Video Advertisement
ఇటీవల సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా బృందం అంతా కలిసి సాయి కుమారి ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లి తిన్నారు. ఇప్పుడు ఎంతో మంది మీడియా వారు, యూట్యూబ్ ఛానల్స్ కూడా సాయి కుమారి ఇంటర్వ్యూలు తీసుకోవడం మొదలు పెట్టారు.
అయితే, నిన్న ఆమె ఫుడ్ స్టాల్ లో వచ్చే జనాల సంఖ్య ఎక్కువ అవ్వడంతో రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అవుతోంది అనే కారణంగా ఫుడ్ స్టాల్ తీయాలి అని పోలీసులు చెప్పారు. అప్పటి నుండి ఎంతో మంది సాయి కుమారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేయడం మొదలు పెట్టారు. తన స్టాల్ కి వచ్చే జనసందోహాన్ని కంట్రోల్ చేసుకుంటూ హోటల్ నడపమని పోలీసులు సాయి కుమారిని ఆదేశించారు. కానీ రోడ్ మీదకి ఉండడంతో, అంతే కాకుండా వచ్చే జనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఫుడ్ స్టాల్ ఆపమని చెప్పారు.
అనుమతి తీసుకున్నాకే ఫుడ్ స్టాల్ తిరిగి ప్రారంభించమని అన్నారు. అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకి సాయికుమారి ఫుడ్ స్టాల్ అలాగే నడపడానికి ఆదేశాలు ఇచ్చారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి త్వరలోనే సాయి కుమారి ఫుడ్ స్టాల్ ని కూడా సందర్శించబోతున్నట్టు సమాచారం. ఏదేమైనా సరే నిన్న సోషల్ మీడియా వల్ల ఫేమస్ అవ్వడంతోనే ఇలాంటి ఇబ్బంది వచ్చింది అనుకున్న వారందరూ కూడా, ఇప్పుడు అదే సోషల్ మీడియా వల్ల సాయి కుమారి సమస్య కూడా పరిష్కారం అయ్యింది అని అంటున్నారు.
End of Article