Ads
పెళ్లి అనే ఒక బంధం కొందరి జీవితాలను స్వర్గమయం చేస్తే మరికొందరి జీవితాలను నరకంలోకి తోసేస్తుంది. అలాంటి ఘటన ఒకటి బెంగళూరులో వెలుగు చూసింది. 12 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న ఒక భార్య కన్నీటి కథ. మైసూర్ కి చెందిన ఒక వ్యక్తి కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమెని ఎవరితో కలవనీయకుండా ఇంట్లో ఉంచి తాళం వేసుకొని బయటికి వెళ్లేవాడు.
Video Advertisement
అంతటితో ఊరుకోకుండా చిత్రహింసలకు గురి చేసేవాడు. అడిగే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అతని హింస 12 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు జరుగుతున్న దారుణాన్ని గ్రహించి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళలను బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు.
తన భర్త ఏ పని మీద బయటకు వెళ్ళినా ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లేవాడని, పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా పదేపదే కొట్టేవాడని చెప్పింది. తన పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చినా తన భర్త ఇంటికి వచ్చి తాళం తీసే వరకు పిల్లలు బయటన వెయిట్ చేయవలసిందే. పిల్లలకి కిటికీలోంచి ఆహారాన్ని అందించేది ఆ తల్లి. మలమూత్ర విసర్జన కోసం ఒక బాక్స్ ఉపయోగించే దానినని, తనని ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది.
గత 12 ఏళ్లుగా మానసికక్షోభకు గురి చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఆ శాడిస్ట్ భర్తకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ భార్య భర్త పై ఫిర్యాదు చేయటానికి నిరాకరించింది. ఇకపై అతనితో ఉండకుండా పుట్టింట్లో ఉంటానని తెలిపింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే ఆ శా-డిస్ట్ భర్తకి ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి, ఇతని వేధింపులు తాళలేక వాళ్ళిద్దరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఈమె మూడవ భార్య కాగా వీరికి ఇద్దరు పిల్లలు.
End of Article