సోనాలి బింద్రే నుండి హంసా నందిని వరకు… “క్యాన్సర్” బారిన పడిన 5 హీరోయిన్స్.!

సోనాలి బింద్రే నుండి హంసా నందిని వరకు… “క్యాన్సర్” బారిన పడిన 5 హీరోయిన్స్.!

by Mohana Priya

Ads

సినిమా రంగం అంటే సాధారణంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మాత్రమే గుర్తొస్తుంది. వారు కూడా మనలాగా మామూలు మనుషులు అనే విషయం మర్చిపోతాం. అలాగే, వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

Video Advertisement

కానీ వాళ్ళు అవి బయట చెప్పకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలా కొంత మంది సెలబ్రిటీస్ తాము క్యాన్సర్ తో బాధ పడినట్టు చెప్పారు. అలా క్యాన్సర్ బారిన పడిన కొంత మంది సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 మమత మోహన్ దాస్

యమదొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మమత మోహన్ దాస్ హోడ్జ్కిన్ లింఫోమాతో బాధ పడ్డారు.

actors who diagnosed with cancer

 

#2 గౌతమి

సీనియర్ నటి గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడారు. తర్వాత క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నారు.

gautami about acting with chiranjeevi

 

#3 సోనాలి బింద్రే

స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ కి చికిత్స పొందారు. తర్వాత సోషల్ మీడియా ద్వారా క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేశారు సోనాలి బింద్రే.

actors who diagnosed with cancer

#4 హంసా నందిని

నటి హంసా నందిని సోషల్ మీడియా ద్వారా తను బ్రెస్ట్ క్యాన్సర్ కి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

actors who diagnosed with cancer

#5 మనీషా కొయిరాలా

కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ మనీషా కొయిరాలా ఒవేరియన్ క్యాన్సర్ కి చికిత్స పొందారు. తర్వాత మళ్లీ ఎన్నో సినిమాల్లో నటించారు.

actors who diagnosed with cancer

వీరు మాత్రమే కాకుండా ఇంకా వేరే భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కాన్సర్ తో పోరాడారు. వారిలో కొంత మంది మాత్రం చికిత్స తీసుకొని కోలుకున్నారు. అయితే, వీరు కోలుకున్నాక క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి ఎన్నో రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత మంది పుస్తకాలు రాస్తున్నారు. మరి కొంత మంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి సెలెబ్రిటీ వారికి ఎలా వీలుంటే అలా ఇలాంటి వ్యాధుల మీద అవగాహన కల్పించడానికి తమ వంతు ప్రయత్నిస్తున్నారు. సెలబ్రిటీ అనే ఒక హోదాని మంచి చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.


End of Article

You may also like