ఆ ఊరి రైల్వే స్టేషన్ లో టికెట్లు కొనడమే.. కానీ రైలు ఎక్కరు.. ఎందుకో తెలుసా..?

ఆ ఊరి రైల్వే స్టేషన్ లో టికెట్లు కొనడమే.. కానీ రైలు ఎక్కరు.. ఎందుకో తెలుసా..?

by kavitha

Ads

సాధారణంగా బస్ లేదా ట్రైన్ లో ప్రయాణం చేయాలంటే టికెట్ కొనడం తప్పనిసరి  అనే విషయం తెలిసిందే. టికెట్ కొన్నా కొన్ని సార్లు అత్యవసర పని వల్లో లేదా మరేదైనా కారణంగానో ఆ ప్రయాణం చేయడం కుదరకపోవచ్చు.  అయితే ఒక ప్రాంతంలో  ప్రతిరోజూ విరాళాలు సేకరించి మరి అరవైకి పైగా ట్రైన్ టికెట్లు కొంటారు. అయితే వారు ఎక్కడికీ ప్రయాణం చేయరు.

Video Advertisement

వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. టికెట్స్ కొని ఎందుకు ప్రయాణం చేయరు అనే సందేహం రాకమానదు.  తమ ఊరి ట్రైన్ హాల్టింగ్  ఎక్కడ రద్దు అవుతుందో అనే భయంతో ఆ ఉరి ప్రజలు రోజు రైల్ టికెట్లు కొంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

నర్సంపేట నియోజకవర్గానికి ఒకే రైల్వేస్టేషన్‌‌ ఉంది. అదే నెక్కొండ రైల్వేస్టేషన్‌‌. ఆ నియోజవర్గంలో కొన్ని మండలాలకు చెందిన ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే నెక్కొండ రైల్వేస్టేషన్‌‌ కే వస్తుంటారు. హైదరాబాద్, ఢిల్లి,  తిరుపతి, శిర్డి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు  ఈ స్టేషన్ లో అనేక రైళ్ల హాల్టింగ్‌ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆదాయం అంతగా లేదనే వంకతో  రైల్వే ఆఫీసర్లు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రిటన్ జర్నీలో నెక్కొండ రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ను రద్దు చేశారు.

పలు ట్రైన్స్ హాల్టింగ్‌ లేక ఇబ్బందిపడుతున్న స్థానిక ప్రజలు, పలుమార్లు రైల్వే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం వల్ల రీసెంట్ గా సికింద్రాబాద్‌ నుండి  గుంటూరు వెళ్లే ‘ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌’ కు టెంపరరీ హాల్టింగ్‌ ను ఇచ్చారు. కానీ రైల్వే అధికారులు స్థానిక ప్రజలకు ఒక షరతు కూడా పెట్టారు. మూడు నెలలపాటు అక్కడి నుండి ఆదాయం వస్తే, పూర్తిస్థాయిలో ట్రైన్ హాల్టింగ్‌ ఇస్తామని, ఆదాయం లేకపోతే క్యాన్సిల్ చేస్తామని వెల్లడించారు.

దీంతో తమ స్టేషన్ లో హాల్టింగ్‌ పోగొట్టుకోవద్దని అక్కడి ప్రజలు అంతా కలిసి ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగా  వాట్సప్‌ గ్రూపును నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్‌ ఫోరం అనే పేరుతో క్రియేట్ చేశారు. ఈ గ్రూపులో దాదాపు 400 మంది చేరారు.  వీరందరూ విరాళాల రూపంలో 25 వేల రూపాయలు ఇప్పటివరకు సమకూర్చారు. ఈ డబ్బు పెట్టి ప్రతి రోజూ నెక్కొండ – ఖమ్మం, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాలకు రైలు టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. స్టేషన్‌కు ఆదాయం చూపించడం కోసం ఇదంతా  చేస్తున్నామని, ఆ గ్రూపు అడ్మిన్లు అయిన రాంగోపాల్‌, వెంకన్న, వేణుగోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ వెల్లడించారు.

Also Read: వైరల్ అవుతున్న “స్మితా సబర్వాల్” 12 క్లాస్ మార్క్స్ మెమో…హైదరాబాద్‌లోనే ఎక్కడ చదివారో తెలుసా.?


End of Article

You may also like