“నారా బ్రహ్మణి” ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

“నారా బ్రహ్మణి” ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

by kavitha

Ads

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, మాజీ మినిస్టర్ నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అలంపూర్‌ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో బాల బ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.  అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు.

Video Advertisement

దేవాలయానికి వచ్చిన నారా బ్రాహ్మణికి ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, గుడి ఈవో పురేందర్ స్వాగతం పలికారు. ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను అందజేశారు. వేదాశీర్వచనం చేసారు. అర్చకులు జోగులాంబ ఆలయ విశిష్ఠతను నారా బ్రాహ్మణికి వివరించారు. గుడి అధికారులు నారా బ్రాహ్మణికి శేష వస్త్రాన్ని, అమ్మవారి జ్ఞాపికను అందచేశారు.
మహామహిమాన్వితమైన అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో అలంపూర్‌ జోగులాంబ దేవాలయం ఒకటి. తెలంగాణలో  జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండలానికి చెందిన గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు పాత మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్‌ మండలంలో ఉండేది. ఇది కర్నూలు నుంచి 25 కి. మీ. దూరంలో ఉంది.  ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన అలంపూర్‌ పట్టణంలో జోగులాంబ ఆలయం ప్రముఖంగా ఉంది.

తుంగభద్రా నది తీరాన,  అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా  అమ్మవారు జోగులాంబగా అవతరించారు. ఈ ఆలయంలో  నిత్యం పూజలు, అభిషేకాలతో అమ్మవారిని పూజయిస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధి పొందిన జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఇది ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ ఎంపీగా నారా బ్రాహ్మణి పోటీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. అత్త భువనేశ్వరితో కలిసి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.  అయితే, ఎలెక్షన్స్ దగ్గరపడుతుండడంతో నారా బ్రాహ్మణి రాజకీయాలలో అడుగుపెడతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2019 లో కూడా ఇలాగే ఆమె పొలిటికల్ ఎంట్రీ పై ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Also Read: ముస్లిం దేశంలో మోడీ చేతుల మీదుగా ప్రారంభం అవ్వబోతున్న ఈ ఆలయం ఏదో తెలుసా..?


End of Article

You may also like