వాలెంటైన్స్ డే రోజు కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నటి…ఆ పోస్ట్ లో ఏముందంటే.?

వాలెంటైన్స్ డే రోజు కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నటి…ఆ పోస్ట్ లో ఏముందంటే.?

by kavitha

Ads

జబర్దస్త్ షో లేడీ కమెడియన్ పవిత్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలోనే  జబర్దస్త్ కామెడీ షోలో అడుగుపెట్టిన పవిత్ర చాలా తక్కువ టైమ్ లోనే తనదైన శైలిలో హాస్యం పండిస్తూ  కమెడియన్ గా ప్రత్యేకమైన గుర్తింపు, పాపులారిటీని సొంతం చేసుకుంది.

Video Advertisement

సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పవిత్ర ఎప్పటికప్పుడు తన లేటస్టే ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తుంటుంది.  ప్రేమికుల రోజు అయిన వాలెంటైన్స్ డే నాడు ఒక షాకింగ్‌ వార్తను సోషల్ మీడియా వేదికగా చెప్పి, ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

పవిత్ర తనదైన కామెడీ టైమింగ్‌తో పాపులర్ అయ్యింది. జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానెల్స్ లో ఈవెంట్లలో సందడి చేస్తూ సంపాదిస్తోంది. ఆమెకు సొంత యూట్యూబ్‌ చానెల్‌ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ లో  తనకు సంబంధించిన సంగతులను ఎప్పటికప్పుడు షేర్  చేసుకుంటుంది. వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

గత ఏడాది నవంబర్ లో పవిత్ర తన లవర్ ను పరిచయం చేస్తూ, ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంతోష్ అనే వ్యక్తిని ఏడాది  పాటు ప్రేమించిన పవిత్ర, నవంబర్ లో నిశ్చితార్థం జరుపుకుంది. ఆ తరువాత ఈ జంట డాన్స్ లు చేస్తూ నెట్టింట్లో సందడి చేశారు. అతనితో కలిసి చేసిన పలు ప్రాంక్ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ లో  షేర్ చేసింది. ఆమె  ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

తాజాగా లవర్స్ డే నాడు పవిత్ర ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో ‘సంతోష్, తాను  విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా దారులు వేరుగా అయినా, మేము పంచుకున్న క్షణాలు ఎంతో ప్రత్యేకం” అంటూ రాసుకొచ్చారు.  ఈ పోస్ట్ కి కామెంట్స్ బాక్స్  ని ఆమె ఆఫ్ చేశారు. తన ఇన్‌స్టాలో ఉన్న సంతోష్ ఫోటోలను మరియు వీడియోలను  తొలగించారు.  ప్రస్తుతం పవిత్ర పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

Also Read:  OORU PERU BHAIRAVAKONA MOVIE PREMIERE REVIEW : “సందీప్ కిషన్” హీరోగా నటించిన “ఊరి పేరు భైరవకోన” ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 

 


End of Article

You may also like