Ads
చర్లపల్లి నాలుగవ రైల్వే టెర్మినల్ స్టేషన్ గా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. మార్చి నుండి ఈ సేవలు మొదలు కానున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మార్చి తొలి వారంలో చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
Video Advertisement
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, స్టేషన్‌ల పై ఒత్తిడి పెరిగడంతో సౌత్ ఇండియన్ రైల్వే 221 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ చేపట్టింది. నిత్యం దాదాపు యాబై వేల మంది పాసింజర్లు రాకపోకలు సాగించే విధంగా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరింపచేశారు. అంతేకాకుండా సరుకు ట్రాన్స్ పోర్ట్ కు పార్శిల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రతి రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగుతుంటాయి. అయితే అక్కడ ప్రస్తుతం పునరాభివృద్ధి వర్క్ కొనసాగుతున్న క్రమంలో కొన్ని ట్రైన్స్ రాకపోకలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్లపల్లి టెర్మినల్ విస్తరణ పనులు పూర్తి అవడంతో మార్చి నుండి కొన్ని రైళ్లను ఈ టెర్మినల్ నుండి నడిపేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 ట్రైన్స్ ను నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పరిమిషన్స్ ఇవ్వాలంటూ రైల్వేబోర్డుకు లెటర్ రాశారు.
ప్రస్తుతం అయితే 6 ఎక్స్ ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అనుమతులు లభించాయి. ఇంకో 12 రైళ్లను చర్లపల్లిలో ఆపడానికి అనుమతులు లభించాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తో సహా ఇతర జోన్లకు సంబంధించిన జనరల్ మేనేజర్లకు కూడా రైల్వే బోర్డు ఆర్డర్స్ జారీ చేసింది. అలాగే ఈ మార్పుల గురించిన సమాచారం కూడా ప్రజలందరు తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లును ఆదేశించింది. చర్లపల్లిని ఎప్పటినుంచి ఉపయోగించాలనే డిసిషన్ స్థానిక ఆఫీసర్లకే అప్పచెప్పింది.
చర్లపల్లి టెర్మినల్ నుంచి మొదలు కాబోతున్న రైళ్లు..
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,
12604 హైదరాబాద్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,
12589/12590 గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ – గోరఖ్ పూర్,
18045 షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్,
18046 హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్,
చర్లపల్లిలో ఆగే రైళ్ళు..
17011/17012 హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,
17201/17202 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్,
12713/123714 విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్,
12757/12758 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్,
17233/17234 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్,
12705/12706 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్,
End of Article