Ads
ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఉత్తమ భార్యగా, ఉత్తమ బిజినెస్ ఉమెన్ గా, ఉత్తమ కోడలిగా ఎప్పుడో తనని తాను నిరూపించుకుంది ఉపాసన. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తన అత్తగారి మీద ఉన్న అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు ఉపాసన. ఆవిడ వంటలు ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో, ఆ వంటకాలు అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ ని ప్రారంభించారు.
Video Advertisement
సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి అసలు సిసలైన అత్త కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. ఇంటి నుంచి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ అత్తమ్మ కిచెన్ చాలా ఉపయోగపడుతుంది. బిజినెస్ లో మంచి ప్రావీణ్యం ఉన్న ఉపాసన ఇప్పుడు ఈ వెంచర్లో తన ప్రావీణ్యం ఉపయోగించి మరింత డెవలప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అత్తమ్మ కిచెన్లో వండిన ఒక్కో వంటకం రుచిని ప్రతి ఒక్కరూ అనుభవించాలని ఆమె భావిస్తుంది.
మొత్తానికి అత్తా కోడళ్ళు ఇద్దరు చేయబోయే ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందరి అభిమానాన్ని చూరగొంటుంది అనేది చూడాలి. ఇన్స్టా వేదికగా ఉపాసన పోస్ట్ చేసిన వీడియోలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది, రుచి సాంప్రదాయం కలిసే చోట బంధాలు తరతరాలుగా నిలబడతాయి. సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఆస్వాదించండి నేరుగా మా వంటగది నుంచి మీ ఇంటికి అంటూ రాసుకొచ్చింది.
తన ఇన్స్టా లో ఇచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ లింక్ ద్వారా ఈ వంటకాలను బుక్ చేసుకొని ఇంటికి తెచ్చుకోవచ్చని చెప్పింది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తానని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా అమెరికాలో కూడా ఒక కౌంటర్ తెరుస్తారు. ఈ వెబ్సైట్లో ప్రస్తుతానికి నాలుగు రకాల రెసిపీలను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇందులో పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్, పులిహోర పేస్ట్, రసం పౌడర్ అందుబాటులో ఉన్నాయి.వాటిని విడివిడిగా కొనుక్కోవడం కుదరదు కాంబో ఆఫర్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
దీని ధర 1,099.00 రూపాయలు ఉంది. ఇవి 700 గ్రాములు ఉంటాయి. ఇలా చూస్తే ఒక్కొక్కటి 250 ఉన్నట్టు లెక్క. బయట మార్కెట్ లో ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు.కానీ వాటి ధర మాత్రం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే అంత తక్కువగానే ఉంటుంది. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా, ఎంత నాణ్యమైన పదార్థాలు ఉపయోగించినా కూడా ఇలాంటివి సామాన్యులు కూడా ఎక్కువగా ఉపయోగించాలి అని ఆశిస్తారు కాబట్టి వాటి ధరలు అంత ఎక్కువగా అయితే ఉండవు.
“దాంతో ఈ ఆలోచన మంచిది కానీ, ధర ఇంకొంచెం తక్కువగా ఉండి ఉంటే బాగుండేది” అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం, “ప్యాకేజ్ ఫుడ్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు?” అని అంటున్నారు. “ఇంత ధర పెట్టి కొనుక్కునే బదులు స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఇంకా తక్కువ ధర అవుతుంది” అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article